Dog
Thursday, 15 December 2011
Monday, 12 September 2011
Saturday, 10 September 2011
Bala Chandar ku Dada Saheb Phalke award
బాలచందర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Nag Chaitanya new scheme
నాగచైతన్య నయా స్కీమ్!
అభిమానుల కోరికమేరకు వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే తన నటనకు మెరుగులు దిద్దుకుంటున్నాడీ యువహీరో. కాగా నాగచైతన్య నటించబోయే ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంలో సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించాలని నాగచైతన్య కోరుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే జిమ్‌లో కండలు పెంచే పనిలో ఉంటున్నాడట. ఇకపై నయా నాగ్‌ను వెండితెరపై చూస్తామన్నమాట.
వీళ్లను ఇలా చూడాలనుంటున్నారు!
వీళ్లను ఇలా చూడాలనుంటున్నారు!
బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు ఎక్కువగా మాస్ తరహా పాత్రలే ప్రేక్షకులు ఆదరించారు. తర్వాత వచ్చిన నాగార్జున, వెంకటేష్‌ల రాకతో కొద్దిగా ట్రెండ్గ మారింది. క్లాస్‌మాస్ అనే తేడా లేకుండా ఇద్దరూ కూడా వివిధ రకాల క్యారెక్టర్లతో మెప్పించారు.
తర్వాత వచ్చిన నాగార్జున, వెంకటేష్‌ల రాకతో కొద్దిగా ట్రెండ్ మారింది. క్లాస్‌మాస్ అనే తేడా లేకుండా ఇద్దరూ కూడా వివిధ రకాల క్యారెక్టర్లతో మెప్పించారు. అయినా కూడా వెంకటేష్‌ను ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్సే ఆదరిస్తూ వచ్చారు. నేటి తరం హీరోలలో ఎక్కువగా మాస్ పాత్రలే చేస్తున్న హీరోలు మనకు కనబడుతున్నారు. అయితే ట్రెండ్‌కు విరుద్ధంగా నేటి హీరోలు వెళితే ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. అసలు సగటు ప్రేక్షకులు, అభిమానులు తమ హీరోల ఎలా చూడాలను కుంటున్నా రో విశ్లేషిస్తే...ముందుగా ప్రిన్స్ మహేష్‌బాబును తీసుకుంటే మహేష్‌ను ఎక్కువగా ‘పోకిరి’, ‘అతడు’ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు.
ఫుల్ లెంగ్త్ కామెడీకి అస్సలు ఒప్పుకోవడంలేదు. సీరియస్‌గా ఉంటూనే హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే పాత్రలలో మహేష్‌బాబు బాగా రాణిస్తాడని అనుకుంటున్నారు. అందుకే మహేష్ రాబోయే ‘దూకుడు’ చిత్రంలో అటువంటి షేడ్స్‌తోనే కనిపించి కనువిందు చేయనున్నాడని టాలీవుడ్ సమాచారం. అలాగే యంగ్‌టైగర్ జూ.ఎన్టీఆర్‌ని ‘అది’, ‘సింహాద్రి’ టైప్‌లో ఫుల్‌లెంగ్త్ మాస్ క్యారెక్టర్లో చూడాలని అభిమానులు కోరుకుంటు న్నారు. డైలాగుల్లో పదునైన కసి ఉండాలి. క్యారెక్టర్లో గాంభీర్యం ఉండాలి. ఇవన్నీ తమ హీరోకు సరిపోతాయని మళ్లీ అటువంటి కథాంశంతో వచ్చే సినిమా కోసం అభిమానులు ఎదురుచూ స్తున్నారు.
అలాగే యువ మెగాస్టార్ రాంచరణ్‌తేజ నటించింది మూడు చిత్రాలే అయినా అందు లో రెండు మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. చ రణ్‌ని ‘గ్యాంగ్‌లీడర్’, ‘అత్తకు యముడు అమ్మా యికి మొగుడు’ తరహా చిత్రా లలో చూడాలని అభిమానులు కోరుకుం టున్నారు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా మంచి మాస్ ఇమేజ్ ఉన్న నటుడే. ‘కటకటాల రుద్రయ్య’, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి చిత్రాలలో నటిస్తే చూడాలని ప్రేక్షకాభిమానుల కోరిక. మరి వీరి కోరిక ఈ హీరోలు తీరుస్తారో లేదో చూడాలి.
Subscribe to:
Posts (Atom)