
ఏంమాయచేశావె, 100%లవ్ చిత్రాలతో క్లాస్ ఇమేజ్‌ను సొంతంచేసుకున్న నవ యువసామ్రాట్ నాగచైతన్య ఇప్పుడు ‘బెజవాడ’, ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాలలో సరికొత్త లుక్స్‌లో దర్శనమీయనున్నాడని సినీవర్గాల సమాచారం. రెండూ విజయవాడ నేపథ్యం కావడం విశేషం. తాత ఏఎన్నాఆర్, తండ్రి నాగార్జునల బాటలో విభిన్న తరహా చిత్రాలను చేయాలనే ధ్యేయంతో దూసుకుపోతున్నాడు నాగచైతన్య. వారసత్వపు హీరో ముద్రనుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే తొలి అడుగులు బలంగా వేస్తున్నాడు.
అభిమానుల కోరికమేరకు వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే తన నటనకు మెరుగులు దిద్దుకుంటున్నాడీ యువహీరో. కాగా నాగచైతన్య నటించబోయే ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంలో సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించాలని నాగచైతన్య కోరుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే జిమ్‌లో కండలు పెంచే పనిలో ఉంటున్నాడట. ఇకపై నయా నాగ్‌ను వెండితెరపై చూస్తామన్నమాట.
No comments:
Post a Comment