
58వ జాతీయస్థాయి ఫిలిం అవార్డులు నేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళ సంచలన దర్శకుడు కె.బాలచందర్‌కు 2010 సంవత్సరానికిగాను అత్యంత ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డ్ నేడు రాష్టప్రతి చేతుల మీదుగా అందుకోనున్నారు. 81 సంవత్సరాల బాలచందర్ తన కెరీర్‌లో దాదాపు 80 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లను తమిళ తెరకు పరిచయం చేసిన బాలచందర్ అనేక మహిళా చిత్రాలను తెరపైకి ఎక్కించి విలక్షణ దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన బొమ్మా- బొరుసా,మరోచరిత్ర, ఆకలిరాజ్యం, అంతులేని కథ, గుప్పెడుమనసు, ఇది కథకాదు వంటి ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయి.
No comments:
Post a Comment