Dog

Saturday, 27 August 2011

About GABBAR SINGH


9నుంచి గబ్బర్‌సింగ్‌ రెగ్యులర్‌ షూటింగ్‌
raamపవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ సెప్టెంబర్‌ 9నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళుతోంది. శృతీహాసన్‌ ఈ చిత్రంలో కథానాయిక. ‘మిరపకాయ్‌’ ఫేం హరీష్‌ శంకర్‌ దర్శకుడు. బండ్ల శివబాబు సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌‌స పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సల్మాన్‌ఖాన్‌ శరీరభాషకి తగ్గట్టు రూపొందిన ‘దబాంగ్‌’ హిందీలో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సారి పవన్‌కళ్యాణ్‌ శరీరభాషకి, మేనరిజానికి తగ్గట్టుగా ఆ చిత్రాన్ని మార్పులు చేసి..సెట్స్‌కెళుతున్నాం. పూర్తిస్థాయి మాస్‌ పాత్రతో ఫుల్‌మీల్స్‌లా ఉంటుందీ సినిమా.

ganeshపవన్‌ అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉంటాయి. ఫైట్స్‌ ఇంతవరకూ రాని రీతిలో నావెల్టీగా చూపిస్తున్నాం’’ అన్నారు. హైదరాబాద్‌, పొల్లాచ్చి, మహాబలేశ్వర్‌, పంచ్‌గని, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఏకధాటిగా షూటింగ్‌ జరుగుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కళ: బ్రహ్మ, ఎడిటింగ్‌: గౌతంరాజు, కథన ం: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, కథనం- మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

No comments:

Post a Comment