మనసెరిగిన మొగుడు

మగపుటక ఉన్న ప్రతివాడూ మగాడు కాదు! తాళికట్టిన ప్రతివాడూ మొగుడు కాలేడు! బాధ్యత తెలిసినవాడు-మగాడు. మనసెరిగినవాడు మొగుడు!..అనే కాన్పెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ‘మొగుడు’. గోపీచంద్ హీరో. తాప్సీ, శ్రద్ధాదాస్ నాయికలు. కృష్ణవంశీ దర్శకుడు. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. తాజా ప్రోగ్రెస్ గురించి నిర్మాత మాట్లాడుతూ ‘ప్రత్యేకశైలితో కుటుంబ కథలను తెరకెక్కించడంలో మా దర్శకుడు దిట్ట. జనరంజకంగా సినిమా తీస్తున్నారు. ఆద్యంతం అలరించే ఈ సినిమా 70శాతం పూర్తయింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకూ చిత్రీకరించాం. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.
No comments:
Post a Comment