
రామ్ హీరోగా నటించిన చిత్రం ‘కందిరీగ’. హన్సిక, అక్ష కథానాయికలు. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తు న్నారు. తమన్ సంగీతం అందిం చారు. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ ఈ నెల 12న సినిమా విడుదల చేస్తున్నామన్నారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘తొలి చిత్రమిది. విజయంపై ధీమా ఉంది. అవకాశమిచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు’ అన్నారు. రచయిత కోనవెంకట్ మాట్లాడుతూ ‘రామ్ నటన సినిమాకే హైలైట్. సంతోష్ శ్రీనివాస్ దర్శకప్రతిభ మెప్పిస్తుంది. ‘రెడీ 2’ను తలపించేలా తెరకెక్కింది. నిర్మాత రాజీలేకుండా ఖర్చు చేశారు. ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా హీరోదే’ అన్నారు. రామ్ మాట్లాడుతూ ‘పాటలు మెప్పించాయి.
సినిమా కూడా విజయం సాధిస్తుంది’ అన్నారు. కలర్స్ స్వాతి, సోనూసూద్, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు, రమాప్రభ, ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, కెమెరా: ఐ.ఆండ్రూ, మాటలు: రాజేంద్రకుమార్, ఫైట్స్: స్టన్‌శివ, డాన్స్: ప్రేమ్క్ష్రిత్, గణేష్, బాబా భాస్కర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.మహేంద్రబాబు, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, కథ-కథనం-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.
No comments:
Post a Comment