తొలి కలయిక
రేకజున్న కథానాయకుడు..పేరున్న దర్శకుడు..
గుర్తింపున్న నిర్మాత..
ఈ ముగ్గురి కలరుుక
పంపిణీదారులనైతే ముగ్గులోకి దించగలదు కానీ నిజానికి
ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేదీ,
ప్రారంభ వసూళ్ళని తెప్పించేదీ
హీరో హీరోరుున్ల కాంబినేషనే..!
ప్రస్తుతం విష్ణూవర్ధన్ రూపొందిస్తోన్న చిత్రంలో పవన్‌కళ్యాణ్ సరసన నటిస్తోన్న అంజలి, సారాజేన్‌లిద్దరూ తెలుగుకి కొత్తవాళ్ళే. ఆపై ‘గబ్బర్ సింగ్’లోనూ శృతిహాసన్ ఫస్ట్‌టైవ్‌ు పవన్‌తో జోడీ కట్టనుంది. అరుుతే వీటిని మించి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రానున్న జీసస్ ్రెకైస్ట్ కథాంశంలో పవన్‌అనుష్క కలిసి కనిపించనున్నారనే అంశం ప్రత్యేకతను సంతరించుకుంది.ఇక ‘దూకుడు’గా వస్తోన్న మహేష్ బాబు పక్కన ప్లేస్ దక్కించుకుంది సమంతా. ‘పోకిరి’ తర్వాత మళ్ళీ మహేష్‌పూరి చేయనున్న ‘ది బిజినెస్‌మెన్’లో ఛాన్స్ కొట్టేసింది కాజల్. ప్రిన్స్‌కి ఇవి రెండూ తొలి కలరుుకలే. అలాగే ఎన్టీఆర్ ఇపడు ఏకకాలంలో తను చేస్తోన్న రెండు సినిమాల్లోనూ నయా నారుు కలతోనే నాట్యమాడనున్నాడు.
సురేందర్‌రెడ్డి సినిమాలో తమన్నా, బోయపాటి శ్రీను చిత్రంలో శృతి హాసన్‌లు హీరోరుున్స్‌గా ఎంపిెకైతారక్‌తో తొలిసారి తెర పంచుకు నేందుెకై తహతహలాడుతున్నారు. ‘మగధీర’ రావ్‌ుచరణ్ సైతం కాజ ల్‌ని కాదనుకుని మరీ ‘రచ్చ’ చేసేం దుకు తమన్నాని ఎంచుకున్నాడు. ఈ ఫస్ట్ కాంబినేషన్ కూడా ఇపడు ్రేకజీయెస్ట్ కాంబినేషనే. ఇక మరోవైపు అల్లు అర్జున్ కూడా త్రివిక్రవ్‌ు సినిమాలో తొలిసారి ఇలియానాతో జతకట్టేందుకు సిద్ధ మవుతున్నాడు. కృష్ణవంశీ దర్శక త్వంలో ‘మెుగుడు’గా వచ్చేందుకు ముస్తాబవుతోన్న గోపీచంద్‌కి తాప్సీ రూపంలో కొత్త జోడీ కుదిరితే.. కరుణాకరణ్ డైరెక్షన్‌లో ‘ఎందు కంటే ప్రేమంట’ అనేందుకు తమన్నాని ఎంచుకున్నాడు రావ్‌ు.
‘దడ’ పుట్టించాలనుకుంటోన్న నాగ చైతన్యకి కాజల్ అగర్వాల్, సోలో’ హీరోగా నిలబడాలనుకుంటోన్న నారా రోహిత్‌కి నిషాఅగర్వాల్ తమ అందాలతో అండగా నిలుస్తున్నారు. అలాగే సీనియర్ హీరోల సరసనా కొత్త జోడీ కిక్కు చూపించేందుెకై కీర్తి క్రియేషన్స్ చిత్రంలో బాలకృష్ణకి లక్ష్మీరాయ్, ‘బాడీగార్డ్’ రీమేక్‌లో వెంకటేష్‌కి సలోనీ వున్నారండోయ్.అరుుతే ఈ తొలి కలరుుకలన్నీ అక్షరాల్లో లక్షణంగానే కనిపిస్తారుు కానీ ఆన్‌స్క్రీన్ తిరుగులేని ెకమి స్ట్రీని చూపించి చూపు తిప్పనివ్వని జంటే కలెక్షన్ల పంట పండిస్తుం దనేది వాస్తవం. మరి జనం చేత క్యూ కట్టించే న్యూ కాంబినేషన్‌గా ఏ పెరుుర్ నిలుస్తుందో.. బాక్సాఫీస్ బరిలో ఏ జోడీ గెలుస్తుందో ప్రేక్షక లోకమే డిసైడ్ చేస్తుంది... ఆ సినిమా రిజల్టే డిేక్లర్ చేస్తుంది కనుక లెట్స్ వెరుుట్ అండ్ సీ..!
No comments:
Post a Comment