ఇక్కడ హీరోని ప్రేమిస్తారు!
కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘నా పేరు శివ’. కాజల్ నాయిక. సుసీంద్రన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయులతో కార్తీ ముచ్చటించారు. ఆ విశేషాలివి...
- ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’ చిత్రాలతో వరుస విజయాలు అందించిన తెలుగు ప్రేక్షకులు నా 3వ చిత్రాన్ని కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ హ్యాట్రిక్ చాలా ఆనందాన్నిస్తోంది. తెలుగువారు నా పెళ్లికి ఇచ్చిన కానుక ఇది. 232 సెంటర్లలో ఓ స్ట్రెయిట్ చిత్రంలా ఈ సినిమా విడుదలైంది. పెళ్లి తర్వాత నేను ఇక్కడ సాధించిన తొలి విజయం కూడా ఇదే. ఆంధ్ర ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
- ఈ సినిమాలో నా పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. చిత్రణలో సహజసిద్ధత ఉంటుంది. దానిని ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని తొలుత భయపడ్డా. మంచి స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ద్వితీయర్థంలో తండ్రి చనిపోయినప్పుడు ..నా నటనకు థియేటర్‌లో స్పందనలు అద్భుతం. నా పాత్ర ఓ హీరోలా కాదు...పొరుగింటి కుర్రాడిలా సాదాసీదాగా ఉంటుంది. నా సినిమాలన్నిటిలోనూ..చాలా ఇష్టపడి చేసిన పాత్ర ఇది. అన్నయ్య (సూర్య), వదిన (జ్యోతిక) ఇద్దరిీ బాగా నచ్చింది.
- 18 వయసు కుర్రాళ్లు పశుప్రవర్తన కలిగి ఉండడం..ఈ సినిమాలో కొత్త పాయింట్. మాదక ద్రవ్యాల సేవనం, హత్యలు..ఈ వయసు పిల్లలు తేలిగ్గా చేసేయడం..చూసినవారికి చాలా వింతగా అనిపిస్తుంది. తల్లిదండ్రులనుంచి సరైన పోషణ లేనివారు సమాజంలో ఎలా అసాంఘిక శక్తులుగా మారుతున్నారో దర్శకుడు బాగా చూపించారు. వారి దుర్వ్యసనాల పర్యవసానంగా సమాజానికి జరిగే నష్టాన్ని కళ్లకు గట్టారు. అలాంటి వారి వల్ల ఓ పచ్చని కుటుంబం ఎలా చిక్కుల్లో పడుతుందో స్క్రీన్‌ప్లే ప్రధానంగా చెప్పడంలో దర్శకుడు విజయం రకాజల్ అందం, శశాంక్, సాహితిల అద్భుతమైన సాహిత్యం సినిమాకి అదనపు అస్సెట్స్‌గా నిలిచాయి. యువన్ సంగీతం హైలైట్.
- రైల్వే స్టేషన్‌లో సన్నివేశం, బ్రిడ్జికింద సన్నివేశం, ఛేజింగ్ సీన్, సునామీ ఎఫెక్ట్ సీన్..ఇవన్నీ చిత్రీకరించడానికి 8రోజులు పైనే పట్టింది. చాలా కష్టపడి చేసిన సన్నివేశాలవి.
రతమిళ ప్రేక్షకులు పెద్ద క్రిటిక్స్. ప్రతిదాంట్లో లాజిక్ వెతుకుతారు! ఇక్కడలా కాదు. తెలుగు ప్రేక్షకులు హీరోయిజాన్ని బాగా ఇష్టపడతారు. హీరోని ప్రేమిస్తారు. సినిమాని పిచ్చిగా ఆస్వాధిస్తారు. అలాగే ఇక్కడ ప్రతిభావంతులైన దర్శకులున్నారు. రాజమౌళి, వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్, దేవకట్టా, భాస్కర్..ఇలా గొప్పవారెందరో. అవకాశమొస్తే వీరితో సినిమాలు చేస్తా.
- ప్రస్తుతం ‘సగుణి’ సహా అనుష్కతో ఓ యాక్షన్ కామెడీలో నటిస్తున్నా. ‘సగుణి’ ద్విభాషా చిత్రం. దీపావళికి విడుదలవుతుంది. ప్రణీత నాయిక. కోటశ్రీనివాసరావు, రోజా, రాధిక.. వంటి దిగ్గజాలంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనుష్కతో సినిమాకి సురాజ్ దర్శకుడు. ప్రయాణాలు ఎక్కువ ఉండే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాల, లింగుస్వామి..ఈ ఇద్దరు దర్శకులు అన్నయ్య, నేను కలిసి నటించే సినిమా కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రనిజానికి హీరో అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోకుండానే ప్రయత్నించాను. అనుకున్నది సాధించాను.
No comments:
Post a Comment