29న సెగ రాజుకుంటుంది!
ఈ సంవత్సరం చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘అలా మొదలైంది’ చిత్రం కాంబినేషన్ నాని,నిత్యామీనన్ మరో సారి వెండితెరపై కనిపించి అలరించనున్నారు. ఈ చిత్రం పేరు ‘సెగ’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గౌతమ్‌మీనన్ అసోసియేట్ అంజన తెరకెక్కిస్తోంది. తమిళంలో ‘వెప్పం’ పేరుతో విడుదలయ్యే ఈ చిత్రం అదే రోజు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. మనదేశం బ్యానర్ పై అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.
నటజీవితం ఎలా సంతృప్తినిస్తోంది?
- అష్టాచెమ్మా చిత్రం ద్వారా నటుడిగా వచ్చిన నేను మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వద్దామనుకున్నాను. కానీ వెంటవెంటనే నా అదృష్టం కొద్దీ మంచి దర్శకుల చేతిలో పడటంతో ప్రస్తుతం నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. నటుడిగా చాలా సంతృప్తిగా ఉంది.
- అప్ కమింగ్ హీరోగా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
జ: నాకంటూ ఫలానా పాత్ర చేయాలని గిరిగీసుకు కూర్చోను. అవకాశం వస్తే...నా మటుకు నాకు నచ్చిన పాత్రలే చేస్తాను. కేవలం డబ్బు కోసమో, మొహమాటం కోసమో ఏ సినిమా పడితే ఆ సినిమాకు కమిట్ అవను. కాకపోతే ‘గ్లాడియేటర్’ లాంటి చిత్రంలో నటించాలని నా కోరిక. అలాంటి అవకాశం వస్తే తప్పక చేస్తాను. - మీ మనసుకు నచ్చే సినిమా అంటే ఎలా ఉండాలి?
జ: మనం ఒక సాధారణ ప్రేక్షకుడిలా థియేటర్‌కి వెళ్లి ఎలా ఎంజాయ్ చేస్తూ...విమర్శిస్తూ సినిమా చూస్తామో నా మటుకు నేను నటించిన సినిమా కూడా నాకుగా నేను అలా విమర్శించుకుంటూ చూస్తే నా తప్పొప్పులు నాకు తెలుస్తాయి. నేను నటించిన చిత్రం కూడా అలానే ఉండాలని కోరుకుంటాను.
నానితో రెండవ సినిమా ఎలా ఉంది?
జ: నానితో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. యూనిట్‌లో అందరితో కలుపుగోలుగా ఉంటారు.
- ఈ చిత్రంలో కూడా పాటలు పాడారా?
జ: నా ప్రధాన లక్ష్యం నటిగా రాణించడం. తర్వాతే ఏదైనా. అలామొదలైందిలో పాడాను కదా అని ప్రతి సినిమాలో పాడలేం కదా...అవకాశం వస్తే తప్పక పాడతాను. అలాగని అదే ప్రొఫెషన్ కాదు. - తెలుగు ఇంత త్వరగా నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారా?
జ: (నవ్వుతూ) ఇలా యాక్టింగ్‌కు, భాషకు ట్రయినప్ అవుతూ పోతే మన జీవితకాలం సరిపోదు. కేవలం యూనిట్ సభ్యులతో మాట్లాడుతూనే అలవాటుచేసుకున్నాను. పైగా దక్షిణాది అమ్మాయినేగా తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టమనిపించలేదు. - ఎన్ని భాషలు మాట్లాడగలరు?
జ: మలయాళ, తమిళ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడగలను. - ‘సెగ’ చిత్రంలో మీ పాత్ర పేరు
జ: ఈ చిత్రంలో నా పేరు రేవతి. అంతా కుటుంబ నేపథ్యంగా సాగిపోయింది. ఒక డిఫరెంట్ మూవీ. - దర్శకురాలు అంజన గురించి
జ: అలా మొదలైంది నందినిరెడ్డిలానే అంజన కూడా మంచి క్రియేటివిటీ ఉన్న దర్శకురాలు. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంటారు. యూనిట్ సభ్యులంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా షూటింగ్‌లో పాల్గొనేవాళ్లం.
No comments:
Post a Comment