
ఛాయాగ్రాహకుడు సంతోష్‌శివన్ దర్శకత్వం వహించిన మలయాళచిత్రం ‘ఉరిమి’. ప్రభుదేవా, ఆర్య, పృథ్వీరాజ్, జెనీలి యా, నిత్యామీనన్, విద్యాబాలన్, టబు ముఖ్య పాత్రధారలు. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు లోకి అనువాదమౌతోంది. ఎస్వీఆర్ మీడియా పతాకంపై శోభారాణి ఇక్కడ అందిస్తున్నారు. హైదరాబాద్‌లో దర్శకుడు వి.వి.వినాయక్ చేతులమీదుగా లోగో ఆవిష్కరించారు. వేడు కలో శోభారాణి, బెల్లంకొండ సురేష్, భీమినేని శ్రీనివాసరావు, రమేష్ పుప్పాల తది తరులు పాల్గొన్నారు. వినాయక్ మాట్లాడుతూ ‘ట్రైలర్స్ చూశాక.. విజువల్ గ్రాండియర్ అనిపించింది. భారత తెరపై అద్భుత చిత్రమని భావిస్తున్నా’ అన్నారు. శోభారాణి మాట్లాడుతూ ‘‘ఉరుమి కత్తి పేరు.

‘రోబో’లానే ఈ పేరు కూడా జనాల్లోకి పాకిపోయింది. సంతోష్ శివన్. .దర్శకత్వం, కెమెరా పనితనం అద్భుతం. భారత్‌ను కనిపెట్టిన వాస్కోడిగామాలో రెండో కోణం దాగుంది. అతడు కేరళలోని ఓ కుటుంబాన్ని నాశనం చేశాడు. అలా నాశనమైన కుటుంబం మరో జన్మలో అతడిపై పగ ఎలా తీర్చుకుందనేదే సినిమా కథ. 16వ శతాబ్దానికి ముడిపడి కథాంశం ఉంటుంది. వారంలో ఆడియో విడుదల చేస్తు న్నాం’ అన్నారు. బెల్లంకొండ మాట్లా డుతూ ‘మలయాళంలో అత్య దిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది’ అన్నారు.
No comments:
Post a Comment