
హ్యాపీడేస్‌తో మలుపు తిరిగిన తమన్నా కథ బద్రీనాధ్ చిత్రం దాకా వెనుదిరిగి చూసుకోవక్కర్లేని పరిస్థితి కల్పించింది. తమిళంలోనూ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించిన తమన్నా దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని చేసిన ‘100 %లవ్’ చిత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది. త్వరలో ఎన్టీఆర్‌తో ఊసరవెల్లి, రాం చరణ్‌తేజతో ‘రచ్చ’ చిత్రాలలో నటిస్తున్న తమన్నాకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చేలా ఉంది. గతంలో రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా స్వీయనిర్మాణ దర్శకత్వంలో తీసిన ‘మర్యాదరా మన్న’ చిత్రాన్ని అజయ్ దేవగన్‌తో హిందీలో నిర్మించేం దుకు రంగం సిద్ధమైంది. అందులో హీరో యిన్‌గా తమన్నాను తీసుకునే అవకా శం ఉందని బాలీవు డ్‌లో ప్రచారం జరుగు తోంది. అజయ్‌దేవ గన్ ప్రస్తుతం రాజమౌళి దర్శ కత్వంలో తెలుగులో హిట్ అయిన ‘విక్రమా ర్కుడు’ చిత్రం హిందీ రీమేక్ ‘రౌడీ రాథోడ్’ చిత్రంలో నటిం చనున్న సంగతి విది తమే. తెలుగులో సునీల్ చేసిన కామెడీ క్యారె క్టర్‌ను చేసేందుకు సిద్ధమౌ తున్నాడు దేవగన్.
No comments:
Post a Comment