మోక్షం తప్పదు!

మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘మోక్ష’. శ్రీకాంత్ వేములపల్లి దర్శకుడు. శ్రీ అమరనాథన్ మూవీస్ పతాకంపై పి.అమర్‌నాథ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మీరాజాస్మిన్ నటిస్తున్న హారర్ చిత్రమిది. తొలిసారి ఈ తరహా లీడ్ పాత్ర చేస్తున్నారు. మరే భాషలో రాని కాన్సెప్ట్ ఇది. నవ్యపంథాలో అన్నివర్గాలను అలరించేలా తెరకెక్కుతోంది. మీరా నటన ప్రధాన ఆకర్షణ. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ అమ్మాయి జీవితంలో అనుకోకుండా చోటుచేసుకునే విచిత్ర సంఘటనల సమాహారమే ఈ సినిమా. ప్రతి సన్నివేశం థ్రిల్‌నిస్తుంది’ అన్నారు. నాజర్, రాహుల్‌దేవ్, సనా, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: వెంకట ప్రసాద్, ఎడిటింగ్: వర్మ, సమర్పణ: హిమబిందు, నిర్మాణ సహకారం: యు.కె.అవెన్యూస్ ఉదయ్‌కిరణ్.
No comments:
Post a Comment