
సూర్య హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నంద’. ఈ సినిమా తెలుగులో ‘బాల-సూర్య’ పేరుతో వస్తోంది. శ్రీ శివశంకర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత నాగమల్ల శంకర్ ఇక్కడ అందిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించిన పాటలు ఆదిత్యా ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో తొలిప్రతిని హీరో శ్రీకాంత్ ఆవిష్కరించి నిర్మాతలమండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌కి అందించారు. ఆడియో వేడుకలో నాగమల్ల శంకర్, సముద్ర, ఆర్.కె.గౌడ్, వర్మ, వి.నరసింహారావు, మల్లయ్య, ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సూర్య, బాలకు తమిళ్ సహా తెలుగులో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అనువాదం నాణ్యంగా చేస్తున్నాం. నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: నయిమ్, కథ-కథనం- దర్శకత్వం: బాల.
No comments:
Post a Comment