మగభామాకలాపం
ఇప్పటితరంలో అయితే అల్లరి నరేష్ కృష్ణభగవాన్‌తో కలిసి ‘కితకితలు’ చిత్రంలో మీసాలతోనే చీరలు కట్టుకుని నటించే సన్నివేశంలో నటించాడు. విజయనిర్మల కుమారుడు సీనియర్ నరేష్ అయితే ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమాలో దాదాపు 70 శాతం చీరకట్టుతోనే ఆ సినిమాలో నటించాడు. ఆ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని నమోదుచేసింది. రాజేంద్రప్రసాద్ కూడా ఒక మంచి కాన్సెప్ట్‌తో చేసిన ‘మేడమ్’ చిత్రంలో చక్కని మెసేజ్ ఇవ్వడమేగాక ఆ చిత్రం ఆద్యంతం తన హావభావాలతో మెప్పించడం విశేషం. విక్రమ్ కూడా ‘మల్లన్న’ చిత్రంలో ధరించిన ఆడవేషంలో అస్సలు గుర్తుపట్టే విధంగా ఉండదు. ఇక మహానటుడు కమల్‌హాసన్ గురించి చెప్పవలసిన పనేలేదు.
‘భామ-రుక్మిణి’ చిత్రంలో నడివయసు స్ర్తీ పాత్రను అలవోకగా చేసేశాడు. ఆ చిత్రం హిందీలో ‘చాచీ-420’ పేరిట రీమేక్ కూడా అయింది. ఆ పాత్రలో కమల్‌హాసన్ ఒదిగిపోయి నటించాడు. లేటెస్ట్‌గా ‘దశావతారం’ చిత్రంలో కూడా పదిపాత్రలు పోషించిన కమల్‌హాసన్‌కు ఇంకా స్ర్తీ వేషంపై ఉన్న మమకారం మీద వృద్దురాలి గెటప్‌లో విస్మయం కలిగించే విధంగా నటించి నటనకే నడకలు నేర్పారాయన. మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ కాలేజీ రోజుల్లో స్టేజినాటకం వేయాల్సివచ్చిందట. అందులో ఒక సన్నివేశంలో ఆ నాటకం తాలూకు దర్శకుడు ఎన్టీఆర్‌ను ఆడపాత్ర కోసం మీసాలు తీసేయమన్నాడట. కానీ ఆత్మగౌరవం దెబ్బతినకూడదని ఎన్టీఆర్ మీసాలతోనే ఆడపాత్రను రక్తికట్టించారట.
ఇంకా మన తెలుగు సినిమాలలో హాస్యనటులలో చాలామందే ఆడపాత్రలు వేశారు. ఆలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, మాడా లాంటి నటులు ఆడపాత్రలలో మెప్పించారు. లారెన్స్ ప్రధానపాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంచన’ చిత్రంలో కూడా ఒక డిఫరెంట్ గెటప్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయడం విశేషం. పైగా చిత్ర విశేషాల గురించి చెబుతూ ఆ పాత్రను అరుంధతి, చంద్రముఖి తరహాలో తీర్చిదిద్దానని చెప్పడం విశేషం. ఈ రకంగా తనకు లభించిన పాత్రను ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని లారెన్స్ చెప్పడం కొసమెరుపు. ముందు ముందు ఇలాంటి పాత్రలు చేసేందుకు మరి కొందరు హీరోలు కూడా సంసిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment