
నాని-నిత్యామీనన్ జంటగా నటించిన అనువాద చిత్రం ‘సెగ’. అంజన దర్శకురాలు. బిందుమాధవి కీలకపాత్రధారి. మనదేశం మూవీస్ పతాకంపై వల్లభనేని అశోక్ ఈ సినిమాని ఇక్కడ అందిస్తున్నారు. ఈ నెల 29న రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నాని గతచిత్రాలకు భిన్నమైన చిత్రమిది. నాని-నిత్యా జంట మరోసారి హిట్ అనిపించుకుంటుంది. హీరోలో మాస్ కోణం ఆవిష్కరించే సినిమా ఇది. పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. జోష్వా శ్రీధర్ సంగీతం అస్సెట్. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో ప్రత్యేకం. దర్శకురాలు బ్లాక్‌బెల్ట్ హోల్డర్ కాబట్టి వాటినీ బాగా తెరకెక్కించారు’ అన్నారు.
No comments:
Post a Comment