కాంచన అదుర్స్ !
రాఘవలారెన్స్ హీరోగా నటిస్తూ.. స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కాంచన’. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. లక్ష్మీరాయ్ కథానాయిక. థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు, ‘రెబల్’ ప్రభాస్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...
మరిన్ని సంగతులు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘‘ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఆసక్తికరం. గంటలోనే అయిపోయిందా అనిపించింది. 2.45 నిమిషాలు సమయాన్ని మరిపించింది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకప్రతిభ..అంతగా సినిమాని నడిపించాయి. అంగ వికలురపై సందేశం, హిజ్రాలపై సందేశం మెప్పించాయి. సాంకేతికంగానూ అద్భుతంగా కుదిరిన సినిమా ఇది. ఈ సినిమాతో లారెన్స్ టాప్ దర్శకుడనిపించుకున్నారు. ఒకేసారి 3 విభిన్న పాత్రల్లో...ట్రాన్స్‌ఫర్ అయి లారెన్స్ బాగా నటించారు. శరత్‌కుమార్‌లాంటి సీనియర్ నటుడు హిజ్రాగా నటించడానికి ఒప్పుకోవడం ప్రశంసించదగ్గ విషయం. ‘రంగూన్ రౌడీ’లో నేను కూడా ఆడవేషంలో నటించాను. మంచి స్పందన వచ్చిందప్పుడు. కుటుంబసమేతంగా ఈ సినిమా ఆస్వాదించదగ్గది’’ అన్నారు.
స్క్రీన్‌ప్లే పరుగులెత్తించారు! -ప్రభాస్
విశ్రాంతి ముందు షాట్ పెద్ద ఝలక్ తినిపించింది. ఆ తర్వాత సినిమా అంతా థ్రిల్లింగ్, హారర్‌తో కట్టిపడేసింది. 10కి పైగా థ్రిల్లింగ్ సీన్స్ వారెవ్వా అనిపించాయి. ఫ్లాష్‌బాక్ తర్వాత పతాకసన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ మాస్టర్ డాన్స్ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. ఆడవేషంలో చూసి లారెన్స్ మాస్టరేనా అన్న సందేహం కూడా ఓసారి వచ్చింది. ఇండియాలోనే ఈ తరహా పాయింట్ టచ్ చేస్తూ ఎవరూ సినిమా తీయలేదేమో! తొలిసారి ఇలాంటి సినిమా చూశాను. కొత్త ఫీల్‌తో, కొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక మాస్టర్‌పై మరింత గౌరవం పెరిగింది. శరత్‌కుమార్ సరికొత్త పాత్రలో ఈ సినిమాలో అలరించడం విశేషం. అంతా థియేటర్లలో సినిమా చూసి ఆస్వాదించండి’’ అన్నారు
No comments:
Post a Comment