
మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దూకుడు’. సమంత కథానా యిక. శ్రీనువైట్ల దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోంది. నిర్మాతలు తాజా ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టులో పాటలు సహా సినిమా విడుదల చేస్తున్నాం. అయితే పైరసీకారులు ఆడియో రిలీజ్‌కి ముందే పాటల సీడీలు అమ్మేస్తు న్నారు. అవి డమ్మీ పాటలు. ప్రేక్షకాభి మానులు వాటిని నమ్మికొనొద్దు. అధికారికంగా ఆగస్టు తొలివారంలో ఆడియో విడుదల చేస్తున్నాం. థమన్ సంగీతం అద్భుతం. అదే నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.
No comments:
Post a Comment