Dog

Thursday, 21 July 2011

Priyudu ga Varun Sandesh


ప్రియుడుగా వరుణ్‌సందేశ్‌
varunsandehsవరుణ్‌సందేశ్‌ హీరోగా ప్రీతికారావు, శ్వేతాబసు ప్రసాద్‌ హీరోహీరోయిన్లుగా యుకె ఎవెన్యూస్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై శ్రావణ్‌ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్‌ నిర్మిస్తున్న చిత్రం టైటిల్‌ని ‘ప్రియుడు’గా కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్‌కిరణ్‌ మాట్లాడుతూ...‘నవ్యమైన కథాకథనాలతో విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు 4 పాటలు, కొంత టాకీ పార్ట్‌ మినహా మిగతా షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన నాలుగు పాటల్లో 2 పాటల్ని ఈ నెల 25 నుండి ఆగస్టు 7 వరకూ బ్యాంకాక్‌, నైనిటాల్‌లో చిత్రీకరించనున్నాం.

మిగతా రెండు పాటలను హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్స్‌ మధ్య చిత్రీకరించనున్నాం’ అని తెలిపారు. దర్శకుడు శ్రావణ్‌ మాట్లాడుతూ ‘యూత్‌ లవ్‌స్టోరీతో పాటు కుటుంబ కథా చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రస్తుత స మాజంలో ఉన్న ప్రేమలు ఎటువంటివో అనే కథాం శంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం :మోహన్‌జోనా, పాటలు: చంద్రబోస్‌, వనమాలి,శక్తి, కేదరీనాధ్‌, కళ: రాము, ఫైట్స్‌:గణేష్‌, కెమెరా: మల్హర్‌భట్‌, నిర్మాత: ఉదయ్‌కిరణ్‌, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రావణ్‌.

No comments:

Post a Comment