Dog

Monday, 13 June 2011

3rd shedulelo ntr- bhoyapati sinu movie


మూడో షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ - బోయపాటి చిత్రం
UNIT-GROUPఎన్టీఆర్‌ కథానాయకుడిగా బోయ పాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మూడో షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. శృతిహాసన్‌ ఈ చిత్రంలో కథానా యిక. కె.ఎస్‌.రామారావు సమర్ప కుడు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలెగ్జాండర్‌ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా ప్రోగ్రెస్‌ గురించి దర్శకుడు మాట్లా డుతూ ‘ఇప్పటికి 13రోజుల పాటు చిత్రీకరణ పూర్తయింది. నాయకానా యికలపై రొమాంటిక్‌ సన్నివేశాలు, ఎన్టీఆర్‌-రాహుల్‌ దేవ్‌లపై పోరాట దృశ్యాలు, ఎన్టీఆర్‌, కోట, బ్రహ్మానం దం, అలీలపై కామెడీ సీన్స్‌ చిత్రీకరిం చాం. ఎన్టీఆర్‌తో తొలిసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. వల్లభ ప్లానింగ్‌ అద్భుతం’ అన్నారు.

నిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలిగే కథాంశమిది. బోయ పాటి అద్భుతంగా తెరకెక్కి స్తున్నారు. ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్త య్యాయి. నేటినుంచి జూలై 11 వరకూ 3వ షెడ్యూల్‌ జరుగు తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కథ- మాట లు: ఎం.రత్నం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటో గ్రఫీ: ఆర్థర్‌. ఎ.విల్సన్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, కళా దర్శకత్వం: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, స్టిల్స్‌: అన్బు, మేకప్‌: ఆర్‌.వి.రాఘవ, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోతహన్‌, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: పి.వి.వి. సోమ రాజు, పి.ఆర్‌.ఓ: బి.ఎ.రాజు, సమ ర్పణ: కె.ఎస్‌. రామారావు, నిర్మాత: అలెగ్జాండర్‌ వల్లభ, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: బోయ పాటి శ్రీను.

No comments:

Post a Comment