Dog

Wednesday, 22 June 2011

interview about 180


Home >> Tollywood >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
అబ్బాయిలకు తెగ నచ్చేస్తా !
సిద్ధార్థ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘180’. అఘల్‌ఫిల్‌‌మ్స-సత్యం సినిమాస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌, నిత్యామీనన్‌ కథానాయికలు. త్వరలో రిలీజ్‌ సందర్భంగా వీరిద్దరూ హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

  • 180లో మీ పాత్ర?
    herionesనా పాత్ర పేరు రేణు. నేనో ఎన్నారై అమ్మాయిని. అమెరికాలో ఉంటాను. ఎదుటివారిని అనుకరించడం...మిమిక్రీ చేయడం ..నా పాత్ర ప్రత్యేకతలు. ప్రత్యేకించి ఈ సినిమాలో నా ఇంట్రడక్షన్‌ సన్నివేశం చాలా బావుంటుంది. సిద్ధార్థ నటన, జయేంద్ర దర్శకత్వం వెరీ స్పెషల్‌.
  • నిత్యామీనన్‌ పాత్రతో పోలిస్తే?
    పూర్తిగా ఆపోజిట్‌ రోల్‌. తను ఇండియాలో ఉండే అమ్మాయి. నేను అమెరికాలో ఉండే ఇండియన్‌ అమ్మాయిని. ఈ సినిమాలో మేమిద్దరం అబ్బాయిలకు తెగ నచ్చేస్తాం. 
  • ఇద్దరు కథానాయికలు ఉండే సినిమాలే చేస్తున్నారేం?
    అలాంటి కథలే వస్తున్నాయి గనుక.
  • మీ మునుపటి చిత్రాల్లో పాత్రలతో పోలిస్తే..ఇక్కడ కొత్తదనం?
    గతంలో చేసినవన్నీ..బబ్లీగా అల్లరిచిల్లరగా ప్రవర్తించే పాత్రలే. ఈ సినిమాలో చేసిన పాత్రలో రకరకాల షేడ్స్‌ కనిపిస్తాయి. పాత్రచిత్రణ చాలా సహజంగా ఉంటుంది. ‘లీడర్‌’లో అల్లరి అమ్మాయిని. ‘రామ రామ కృష్ణ కృష్ణ’లో కబుర్లు ఎక్కువ చెప్పే గడుగ్గాయిని. 180లో మాత్రం సరికొత్త ఎన్నారైని!
  • తమిళ్‌, తెలుగు ఏది సౌకర్యం?
    రెండు భాషలూ సౌకర్యమే. లీడర్‌ టైంలో తెలుగు నేర్చేసుకున్నా. 
  • మీ ఫేవరెట్‌ హీరో?
    రజనీకాంత్‌. 
  • మీ స్టైలిస్ట్‌ గురించి?
    భాను. ఐదు నిమిషాల్లో రూపం పూర్తిగా మార్చేసేంతటి సమర్థురాలు. 
  • నటనలో మీ నిపుణత గురించి?
    నేనేమీ థియేటర్‌నుంచి రాలేదు! నటిస్తూనే నేర్చుకుంటున్నా! సెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నా.

    వివాదం వద్దు ప్లీజ్‌ !

  • 180లో మీ పాత్ర?
    జర్నలిస్ట్‌. పేరు.. విద్య. పత్రికలో పనిచేసే ఫోటో జర్నలిస్టునన్నమాట! అయితే జర్నలిజంను ఎక్కువ ఎలివేట్‌ చేసే పాత్ర కాదు. 
  • రెండు భాషల్లో తెరకెక్కిందీ సినిమా. ఏ భాష మీకు సౌలభ్యం?
    తమిళ్‌ బాగా వచ్చు. తెలుగు కొంచెం కొంచెం. ‘అలామొదలైంది’ తర్వాత చాలా వేగంగా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం బానే మాట్లాడుతున్నా.
  • సౌందర్యతో మిమ్మల్ని పోల్చడం ఎలా అనిపిస్తుంది?
    పోలిక నాకు నచ్చదు! అయితే సౌందర్యతో పోల్చడం చాలా గొప్ప విషయం. ఆమెకు రీప్లేస్‌మెంటే లేదు. తనలా ఎవ్వరూ నటించలేరు. నటన, అభినయంతో అందరి హృదయాలను దోచిన నటి సౌందర్య. 
  • పెద్ద హీరో..వెంకటేష్‌ సరసన నటించే అవకాశాన్ని ఎందుకు కాదన్నారు?
    నేను సరిపోను! నా ఎత్తు, వయసు పెద్ద సమస్య. ఒకవేళ నేను తన పక్కన నటించినా..జస్టిఫికేషన్‌ అనేది ఉండదు. జనరేషన్‌ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఫిజికల్‌గా తేడా తెలిసిపోతుంది. ఈ విషయంలో నేను మాట్లాడింది అర్థం చేసుకోకుండా రచ్చకెక్కించారు. దయచేసి కాంట్రవర్శీలోకి లాగకండి!
  • ఒకవేళ ప్రభాస్‌ సరసన నటించాల్సొస్తే?
    ప్రభాస్‌ ఎవరు? 
  • కాంట్రవర్సీ వద్దన్నారు. అప్పుడే వివాదం రేపారే?
    సారీ..నేను సినిమాలు పెద్దగా చూడను. తెలుగులో నేను చూసిన ఏకైక సినిమా ‘మగధీర’. నేను తెలియక అనేసినదేదైనా..రచ్చకెక్కించకండి ప్లీజ్‌! ఏమైనా అంటే యథాలాపంగా అనేశానంతే. అలాగే..రవితేజ, రానా తెలుసు..! ఎందుకంటే వాళ్లతో నటించమని నా దసహనటులు అంటుంటే తెలుసుకున్నా.
    తదుపరి ప్రాజెక్టులు
    నానితో ‘సెగ’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ మాతృక ‘వెప్పం’. మలయాళ సినిమాలు ఓ మూడు చేస్తున్నా. ఒకటి విడుదలకు సిద్ధమవుతోంది.

No comments:

Post a Comment