Dog

Friday, 10 June 2011

heroins cricket

మేమూ క్రికెట్‌ ఆడతాం
asహీరోయిన్లు బ్యాటింగ్‌ చేస్తుండగా..హీరోలు ఫీల్డింగ్‌ చేస్తే ఆ మజాయే వేరు! ఆడేవాళ్లకే కాదు..చూసేవాళ్లకు మజా వస్తుంది’’ అన్నారు కథానాయిక శ్రీయా శరణ్‌. ప్రస్తుతం జరుగుతున్న తారల క్రికెట్‌ మ్యాచ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌కొచ్చిన శ్రీయ పాత్రికేయులతో ముచ్చటిస్తూ..పై విధంగా స్పందించారు. మరిన్ని ముచ్చట్లు పంచుకుంటూ..‘అందరిలానే నేనూ క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను. ప్రస్తుతం జరుగుతున్న హీరోల సిసిఎల్‌ (సెలబ్రిటీ క్రెట్‌ లీగ్‌) మ్యాచ్‌లు లాంటివే మేమూ (హీరోయిన్లు) ఆడితే బావుండేది. సిసిఎల్‌ సారధి విష్ణువర్థన్‌ అలాంటి ప్రణాళిక వేస్తే బావుంటుంది.

వ్యాపారానికి వ్యాపారం...ఆనందానికి ఆనందం! సిసిఎల్‌లో ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా నాగార్జున తనయుడు అఖిల్‌ ఆట అమోఘంగా ఉంది. తను నా ఫేవరెట్‌ క్రికెటర్‌. అలాగే నాలుగు రాష్ట్రాలనుంచి స్టార్లంతా వచ్చి ఒకేచోట ఆడడం పండుగను తలపిస్తోంది’ అంటూ హుషారుగా, సరదాగా మాట్లాడారు. సల్మాన్‌ఖాన్‌, సూర్య, వెంకటేష్‌ ..ఇలా స్టార్లంతా రేపటి(జూన్‌ 12) ఫైనల్‌మ్యాచ్‌ వీక్షణకు హైదరాబాద్‌ విచ్చేస్తారని శ్రీయ తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్‌ తషుకౌషిక్‌, సిసిఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
Related Videos  

No comments:

Post a Comment