
యువ గీత రచయిత కలువసాయి అర్ధాంతరమృతి చెందారు. ఈయన వయసు 30 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో గీత రచయితగా కొనసాగుతున్న కలువసాయికి రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రక్తచరిత్ర’, ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు’ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గీత రచయితగా కలువసాయి కెరీర్ ఇక కుదుటపడడం ఖాయం అని అతని మిత్రులు, శ్రేయోభిలాషులు సంతోషపడుతున్న తరుణంలో కలువసాయి మరణం అందరికీ తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ముప్పయేళ్ల కలువసాయి గుండెపోటుతో మరణించారు!
No comments:
Post a Comment