హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్ చివరి చిత్రం హీరోయిన్

ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం ‘హీరోయిన్’ అనే చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. ‘హీరోయిన్’ అనే పేరు గల ఈ చిత్రమే ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించే చివరి చిత్రమనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఐశ్వర్య గర్భం దాల్చింది. శారీరకమైన మార్పులు కనిపించేలోపే ‘హీరోయిన్’ చిత్రం షూటింగ్ పూర్తి చేయనున్న ఐశ్వర్య, ఆ తర్వాత సుమారు కనీసం రెండు సంవత్సరాలయినా బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండడం ఆవశ్యం. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ వయసు 38. మళ్లీ సినిమాల్లో నటించే పరిస్థితి వచ్చేసరికి ఆమెకు 40 నిండుతాయి. అప్పుడు కూడా ఆమెకు అవకాశాలు రావచ్చు. కానీ.. హీరోయిన్‌గా కాకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కాబట్టి మెయిన్ హీరోయిన్‌గా ఐశ్వర్య నటించే చివరి చిత్రం ‘హీరోయిన్’ కావచ్చని బాలీవుడ్ వర్గాల భోగట్టా!
No comments:
Post a Comment