Dog

Wednesday, 29 June 2011

Sidharth- 180


నువ్‌ పోతానంటే మేమొద్దంటామా!
Siddharthతమిళ ఆడియన్స్‌ మన తెలుగు హీరోల పట్ల వివక్ష చూపినట్లుగా ‘తమిళ తంబి’ సిద్దార్ధపైై తెలుగు ప్రేక్షకులెప్పుడూ పక్షపాతం చూపలేదు. కళకు భాషాబేధాలుండరాదని త్రికరణశుద్ధిగా నమ్మేవాళ్లలో తెలుగువారిది ప్రధమ స్థానం. అందుకే ‘నువ్వొస్తానంటే మేమొద్దంటామా’ అంటూ సిద్దార్దకు తెలుగు చిత్రసీమలో ఏకంగా చిన్న ‘బొమ్మరిల్లు’ కట్టిపెట్టారు. అయితే అది తెలుగువారి మంచితనం అనుకోకుండా.. తన గొప్పతనంగా భావిస్తూ.. సిద్దార్ద చేస్తున్న ఎగస్ట్రాలను సైతం మీడియా ఇన్నాళ్లూ లైట్‌గా తీసుకుంది. ‘తెలుగువాడు కాదు కాబట్టి..’ అంటారనే ఉద్దేశ్యంతో సంయమనం పాటించింది.

అయితే, మీడియాపై సిద్దార్థ చేస్తున్న వ్యాఖ్యానాలు రోజురోజుకూ శృతిమించుతుండడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇకపై సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌పై సిద్దార్థ్ద చేసిన వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణిస్తూ.. అతడిపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు, నిర్మాతల మండలికి.. ‘న్యూస్‌ కేస్టర్స్‌ అసోసియేషన్‌’ ఫిర్యాదు చేసింది. అంతేకాదు. నిన్న ఏర్పాటు చేసిన ‘180’ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిద్దార్థను ఎలక్ట్రానిక్‌ మీడియా బహిష్కరించింది. ‘ఒక గంట ప్రోగ్రాం చేసుకోవడం కోసం ఛానల్స్‌వారు తమ పెళ్లాంబిడ్డల్ని సైతం అమ్మకానికి పెట్టేస్తారు’ అంటూ తన ట్విట్టర్‌లో సిద్దార్థ్ద ఇటీవల పోస్ట్‌ చేసాడు. ఇంతకుముందు కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యానాలు సిదార్థ చేసి ఉన్నాడు!

No comments:

Post a Comment