Dog

Wednesday, 22 June 2011

new heros


తెలుగు తెరపై కొత్త కెరటాలు
heorsతెలుగు సినిమారంగంలో వారసత్వం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు కొత్తనీరు వచ్చినట్లు...సముద్రంలో కెరటాలు మాదిరిగా హీరోలు వస్తుంటారు. ఇప్పటికే నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, కొణిదెల, దగ్గుపాటి, మంచు వంశాలనుంచి వారసులు సినీరంగాన్ని ఏలుతున్నారు. వీరిలో ఎక్కువగా నందమూరి, అక్కినేని వంశాలనుంచి మూడవతరం కూడా వచ్చేసింది. అతి తొందరలోనే నాల్గవతరం కూడా వారసత్వశ్రీకారం చుట్టనుంది. వాళ్ల విషయం పక్కనపెడితే ఇప్పుడు సరికొత్తగా సినిమా రంగానికి ముచ్చటగా ముగ్గురు కొత్త కథానాయకులు వస్తున్నారు.

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ ప్రముఖ దర్శక,నిర్మాత వైవిఎస్‌ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్‌ చౌదరి సాయిధరమ్‌ తేజతో ఎటువంటి చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ హీరోగా ‘రేయ్‌ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరుపుకుని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అలాగే ఘట్టమనేని వంశం నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక్క హీరో అని అభిమానులు అనుకుంటున్న తరుణంలో కృష్ణ మేనల్లుడు సుధీర్‌బాబును హీరోగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి పరిచయం చేయనున్నారు.

తమిళంలో సూపర్‌హిట్‌ అయిన సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అలాగే ఘట్టమనేని ప్రియ ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌వి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఎస్‌వి బాబు నిర్మాతగా గౌతమ్‌ పట్నాయక్‌ దర్శకత్వంలో హీరో ప్రభాస్‌ కజిన్‌ సిద్ధార్థ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘కెరటం’ అనే చిత్రం రూపొందనుంది. ఇక కృష్ణంరాజు కుటుంబం నుంచి కూడా రెండో వారసుడు లేడని నిరాశపడుతున్న అభిమానులకు హీరో సిద్ధార్థ రాజ్‌కుమార్‌ కొత్త ‘కెరటం’లా దూసుకొస్తున్నాడు.

No comments:

Post a Comment