Dog

Monday, 20 June 2011

rajendra prasad new film


సన్‌షైన్‌ సినిమా ప్రారంభం
rajendraparsadసన్‌షైన్‌ సినిమా పతాకంపై స్వీయనిర్మాణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలో కె.క్రాంతిమాధవ్‌ రూపొందిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజాకార్యక్రమాల్లో ఆర్పీ సహా దర్శకుడు క్రాంతిమాధవ్‌, కథారచయిత తమ్ముడు సత్యం, మాటల రచయిత మరుధూరి రాజా, ఛాయాగ్రాహకుడు హరి అనుమోలు, సీనియర్‌ నటుడు గిరిబాబు, రమేష్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రపసాద్‌పై చిత్రీకరించిన తొలిసన్నివేశానికి ప్రసాద్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ క్లాప్‌నివ్వగా, స్రవంతి రవికిశోర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. గిరిబాబు గౌరవదర్శకత్వం వహించారు.

దర్శనిర్మాత క్రాంతి మాట్లాడుతూ ‘నేటినుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ (13రోజులు)కు వెళుతున్నాం. గ్యాప్‌ తర్వాత మిగిలిన చిత్రీకరణ పూర్తిచేస్తాం. హైదరాబాద్‌, పాలకొల్లు, రాజోలు పరిసరాల్లో షూటింగు జరుగుతుంది’ అన్నారు. రఘుబాబు, గిరిబాబు, చలపతిరావు, బెనర్జీ, రవి ప్రకాష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, కెమెరా: హరి అనుమోలు, ఎడిటింగ్‌: గౌతంరాజు, కళ: బాబ్జి, మాటలు: మరుధూరి రాజా, కథ-ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: తమ్ముడు సత్యం, నిర్మాత-కథనం- దర్శకత్వం: క్రాంతి మాధవ్‌.

No comments:

Post a Comment