మనసుల మధ్య కబడ్డీ
మురళీమోహన్ గౌరవదర్శకత్వం వహించారు. ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ ‘ప్రేమ పయనంలో ..మనసులు ఆడే దోబూచులాటే.. ఈ సినిమా. స్ఫూర్తివంతమైన ఈ కథకు సంగీతం ప్రధానాంశంగా ఉంటుంది. టైటిల్‌కి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. మా చిత్రదర్శకుడు సీనియర్ దర్శకుడు వి.సముద్రకి శిష్యుడైతే, మా కెమెరామెన్ ...శ్యామ్ కె.నాయుడుకి శిష్యుడు. జూలై తొలివారంలో సెట్స్‌కెళ్లి..భారీ షెడ్యూల్‌లో టాకీ పూర్తి చేస్తాం. తర్వాత 2 పాటలు విదేశాల్లో చిత్రీకరిస్తారు. నా సినిమాల్లోనే ట్రెండీ సినిమా ఇది’ అన్నారు. 6పాటల్లో రెండిటిని ఇప్పటికే పూర్తిచేశానని సంగీతదర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.రాజశేఖర్, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: నందమూరి హరి, కళ: రామ్, మాటలు: కేశవ్.పి, కథ-కథనం- దర్శకత్వం: శ్రీ.
No comments:
Post a Comment