
అలా మొదలైంది’ చిత్రంతో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించి.. వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న నిత్యామీనన్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది. ‘ఏమాయ చేసావె’, ‘100% లవ్’ చిత్రాలతో వరుస వియాలు సాధించి సాటి హీరోలకు ‘దడ’ పుట్టిస్తున్న నాగచైతన్య నటించే తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్ ఎంపికైందని తెలుస్తోంది. నిత్యామీనన్ ప్రస్తుతం సిద్దార్ధతో ‘ఓ మై ఫ్రెండ్’ అనే చిత్రంతో పాటు మరో చిత్రంలోనూ నటిస్తోంది.
No comments:
Post a Comment