Dog

Friday, 24 June 2011

About Sidharth carrier


సిద్దార్ధ కెరీర్‌ చివురించేనా ?
Movie-Stillడజనుకు పైగా చిత్రాల్లో నటించిన ‘తమిళ తంబి’ సిద్దార్ధకు ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ మినహా మరో హిట్‌ లేకపోవడంతో అతని కెరీర్‌ దాదాపుగా మోడువారిపోయింది. సిద్దార్ధ నటించిన ‘చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్‌, బావ’ వంటి చిత్రాలతోపాటు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘అనగనగా ఓ ధీరుడు’ అత్యంత ఘోరంగా నిరాశపరడం.. నిర్మాతలు మొదలుకుని కొనుగోలుదారులు, పంపిణీదారులందర్నీ తీవ్ర స్థాయిలో నష్టపరచడం తెలిసిందే. ఈ నేపధ్యంలో సిద్దార్థ ఆశలన్నీ రేపు విడుదలవుతున్న ‘180’ చిత్రంపైనే ఉన్నాయి. ఈ చిత్రం కూడా హిట్‌ కాని పక్షంలో ఇప్పటికే క్షీణ దశలో ఉన్న సిద్దార్ధ కెరీర్‌ మరింత క్లిష్ట పరిస్థితిలో పడే ప్రమాదముంది.

ఇకపోతే.. ఈ చిత్ర కథానాయకి నిత్యామీనన్‌ చేస్తున్న ‘ఎక్స్‌ట్రాలు’ ( ‘ప్రభాస్‌ ఎవరు?’ అని ప్రశ్నించడం వంటివి) ఇప్పటికే చర్చనీయాంశమవుతుండడం, ఈ చిత్ర కథానాయకుడు సిద్దార్ధ గురించి సైతం ఆమె నెగటివ్‌గా మాట్లాడి ఉండడం (శృతిహాసన్‌ కోసం తనను తీసేయమని సిద్దార్ద ఫోర్స్‌ చేయడం వలనే తనను ‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమా నుంచి దిల్‌రాజు తీసేసారని ప్రకటించడం), మీడియాతో సత్సంబంధాలు నెరపాల్సిన అవసరాన్ని ఈ మలయాళీ భామ గుర్తించకపోవడం, తను నటించిన ‘180’ సినిమాకు పీయార్వోగా వ్యవహరిస్తున్న వ్యక్తి.. ఓ ప్రముఖ దినపత్రికకు ప్రాతినిధ్య వహిస్తున్న ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ అనే విషయాన్ని విస్మరించి.. సాటి జర్నలిస్టులందరి సమక్షంలో తూలనాడడం, ముఖ్యంగా సీనియర్‌ హీరోలకు ‘నో’ చెబుతుండడం వంటి అంశాలన్నీ ‘180’ చిత్రానికి ప్రతికూలం కానున్నాయి. ఇక రెండే రెండు హిట్లుతో తన కెరీర్‌ను నెట్టుకొస్తున్నప్పటికీ ‘సూపర్‌స్టార్‌’లా ఫీలయిపోతుండే సిద్దార్థకు కూడా మీడియాతో సంబంధాలు అంతంతమాత్రమే. మరి ఈ ప్రతికూలాంశాలన్నిట్నీ అధిగమించడం ‘180’ చిత్రానికి ఎంతవరకు సాధ్యమవుతుందనేది 180 డాలర్ల ప్రశ్న!

No comments:

Post a Comment