Dog

Wednesday, 29 June 2011

Amitab 'Budda'

అమితాబ్‌ బుడ్డా కాదని చెప్పేందుకే...
puri-amithabఅమితాబ్‌ కెరీర్‌లో వస్తున్న అత్యుత్తమ యాక్షన్‌ చిత్రమిది. నిజానికి వయసుడిగి నా.. అమితాబ్‌ బుడ్డా కాదని చెప్పడమే నా ధ్యేయం’ అంటున్నారు పూరి జగన్నాధ్‌. ఆ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ.. ‘అమితాబ్‌ ఇప్పటికీ నవ యువకుడే అని సెట్స్‌లో రుజువు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ‘ఢిల్లీబెల్లీ’ కూడా ‘బుడ్డా..’ రిలీజ్‌ రోజే విడుదలవుతోంది. ఇమ్రాన్‌కంటే అమితాబ్‌ చిన్నోడని నిరూపిస్తారు. ముంబై రోడ్లపై 150కి.మీ వేగంతో కారు నడిపే బిగ్‌బి..ఈ సినిమాలో ఏకంగా హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌నే నడిపారు’ అన్నారు. తదుపరి ప్రాజెక్టుల గురించి విశ్లేషిస్తూ... మహేష్‌బాబుతో ‘బిజినెస్‌మేన్‌’ పూర్తయ్యాక..అదే చిత్రాన్ని అభిషేక్‌ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తానన్నారు. ‘ఇడియట్‌’ సీక్వెల్‌ తీసే ఆలోచన కూడా ఉందని ఆయన తెలిపారు. అమితాబ్‌తో సినిమా చేస్తానని ఊహించారా? అన్న ప్రశ్నకు సమాధానంగా దర్శకుడినవుతానని కానీ, అమితాబ్‌తో సినిమా తీస్తానని కానీ ఊహించలేదు. ‘బుడ్డా’ సెట్స్‌కెళ్లాక 15 రోజుల తర్వాత వ్యాన్‌లో భోజనం చేస్తూ.. ఏడ్చేశానని పూరి జగన్నాథ్‌ అన్నారు.

No comments:

Post a Comment