
నమిత ప్రధానపాత్రలో రూపొందిన అనువాద చిత్రం ‘పచ్చిమిరపకాయ్’. ఒన్ విజన్ మీడియా పతాకంపై జి.సోమేశ్వరరెడ్డి, వి.ఆర్.ఆర్ సంయుక్తంగా తెలుగులో అందిస్తున్నారు. పొందూరి సాహిత్యం, దిన సంగీతం అందిం చారు. ఇటీవల ఆడియో శివరంజని ద్వారా విడుదలైంది. విజయేందర్‌రెడ్డి ఆడియో తొలిప్రతిని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. సినిమాలో యువతను ఉర్రూతలూగించే గ్లామర్‌కు కొదవలేదు. అత్త-అల్లుడు మధ్య సాగే రసరమ్య పోరు మధ్యలో ఎంటరయ్యే పాత్రలో నమిత నటించారు. అత్తగా నదియా, హీరోగా సుందర్.సి నటించారు. వివేక్ కామెడీ వెరీ స్పెషల్. 5 పాటలు, 4ఫైట్స్ హైలైట్’ అన్నారు.
No comments:
Post a Comment