తెలుగు సినిమా - జంతుప్రేమ
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రానికి ‘ఊసరవెల్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, రామ్-హన్సిక జంటగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘కందిరీగ’ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెలాఖరుకు ఆడియో విడుదల చేసి, వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే, సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నాని-సమంత జంటగా రూపొందుతున్న చిత్రం పేరు ‘ఈగ’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏక కాలంలో విడుదల కానుంది.
అదేవిధంగా శివాజీ గణేశన్ మనవడు జూశివాజీ గణేశన్ హీరోగా.. గౌరీముంజల్, మాళవి ముఖ్య తారాగణంగా రూపొంది తమిళంలో ఘన విజయం సాదించిన ‘సింగకుట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ ‘చిరుతపులి’ పేరుతో తెలుగులోకి అనువదిస్తుండడం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలన్నిట్నీ స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో.. తనీష్ హీరోగా డి.యస్.రావు నిర్మిస్తున్న ఓ చిత్రానికి ‘కోడిపుంజు’ అనే టైటిల్ పెట్టారు. మరి భవిష్యత్తులో ఇంకెన్ని జంతువుల పేర్లు ఇంకెన్ని సినిమాలకు టైటిల్స్‌గా మారతాయో వేచి చూడాల్సిందే!
No comments:
Post a Comment