
ముంబయి విమానాశ్రయంలో ప్రముఖ నటి అనుష్కను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త నిన్న తెలుగు చిత్రసీమలో కొంత కలకలం సృష్టించింది. ఆమధ్య ఆదాయశాఖ దాడులకు గురయిన అనుష్క మళ్లీ ఇంత తొందరగా అడ్డంగా ఎలా దొరికిపోయిందని అందరూ బాధపడడం మొదలుపెట్టారు. కొందరయితే.. అనుష్కపై ఎవరయినా ఓ ప్రముఖుడు కక్ష కట్టి ఉంటాడని.. ఈ పరిణామాలన్నీ అందుకు ఉదాహరణలనే కన్‌క్లూజన్‌కు వచ్చేసారు. తీరా చూస్తే.. ముంబయిలో కస్టమ్స్ అధికారుల అదుపులో ఉన్న అనుష్క మన అనుష్క కాదని.. బాలీవుడ్‌అనుష్కని తేలింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘రబ్ నే బనాది జోడి’, ‘బ్యాండ్ బాజా బారాత్’ వంటి సినిమాల ద్వారా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క పూర్తి పేరు అనుష్కశర్మ. మన ‘అరుంధతి’ అనుష్క పూర్తి పేరు అనుష్కశెట్టి. దాంతో అప్పుడప్పుడు ఇలాంటి గందరగోళం నెలకుంటోంది!
No comments:
Post a Comment