Dog

Friday, 10 June 2011

SEPTEMBER LO SRIRAMARAJYAM

సెప్టెంబర్‌లో శ్రీరామరాజ్యం
balaiahaశ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ధుర్యోధనుడు, కర్ణుడు...వీళ్లందరూ ఎలా ఉంటారు? అని ఒక ప్రశ్నవేస్తే ‘నందమూరి తారక రామారావు’ చిత్రపటాలను చూపిస్తారు మన తెలుగు ప్రేక్షకులు. పౌరాణిక పాత్రల్లో ఆయన అంతగా ఒదిగిపోయారు. గంభీరమైన కంఠస్వరం, హుందాగా అగుపించే ఆహార్యం, అద్భుతమైన నటనతో ఎన్టీఆర్‌ ఆ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు. ఆయన వారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణకు కూడా పౌరాణిక పాత్రలంటే మహాప్రీతి. ఉత్తమాభిరుచిగల నిర్మాత యలమంచి సాయిబాబు ‘శ్రీరామరాజ్యం’ చిత్రానికి శ్రీకారం చుట్టారు.

ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వాల్మీకిగా డా.అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడిగా శ్రీకాంత్‌, సీతగా నయనతార, భరతునిగా సాయికుమార్‌, ఆంజనేయుడిగా విందు ధారాసింగ్‌, కౌసల్యగా కె.ఆర్‌.విజయ, జనకునిగా మురళీమోహన్‌, వశిష్టుడిగా సీనియర్‌ బాలయ్య, భూదేవిగా జయసుధ, చాకలి తిప్పనిగా బ్రహ్మానందం...ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. కథానుసారం కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని సాయిబాబు ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది!

No comments:

Post a Comment