Dog

Monday, 13 June 2011

himalayalatho 'allu'kunna bandham


హిమాలయాలతో ‘అల్లు’ కున్న అనుబంధం
tammannaమూడు రోజుల్లో రూ.16.50కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది మా సినిమా. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.14.50కోట్లు, కర్నాటకలో రూ.1.50కోట్లు, కేరళలో రూ.75లక్షలు కలుపుకుని ఈ మొత్తం వసూలైంది. ‘మగధీర’ కంటే తొలిరోజు వసూళ్లు కోటి 35లక్షలు తక్కువ అంతే. అలాగే సోమవారం ఉదయం ఆట హౌస్‌ఫుల్‌. రాష్ట్రంలో అన్ని థియేటర్లు వాకబు చేసి చెబుతున్న మాట ఇది. టాలీవుడ్‌లోనే బెస్ట్‌ -4 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందీ సినిమా’’ అన్నారు అల్లు అరవింద్‌. ఆయన నిర్మాతగా, తనయుడు అల్లు అర్జున్‌ హీరోగా గీతాఆర్ట్స్‌ పతాకంపై రూపొందించిన ‘బద్రినాథ్‌’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తమన్నా ఈ చిత్రంలో కథానాయిక.

వి.వి.వినాయక్‌ దర్శకుడు. తొలి మూడు రోజుల వసూళ్ల గురించి వివరించిన అనంతరం మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ ‘బన్ని కెరీర్‌ హిమాలయాలతో ముడిపడి ఉంది. తొలిసినిమా ‘గంగోత్రి’ అక్కడే ప్రారంభమైంది. ‘దేశముదురు’కి అక్కడి పరిస రాలతో అనుబంధ ముంది. తాజాగా మూడో సినిమా ‘బద్రీనాథ్‌’ ఆ పుణ్యస్థలంలోనే తెరకెక్కిం చాం. ఎంతోమంది బద్రినాథ్‌ వెళ్లాలను కున్నా కుదరదు. అలాంటివారు ఈ సినిమా చూసి.. తరించవచ్చు. అలాగే బద్రినాథుని దర్శించుకొనే ఓ అవకాశం ప్రేక్షకులకు కల్పిస్తున్నాం. త్వరలో ఈ చిత్రంపై ఓ కాంటెస్ట్‌ పెడుతున్నాం. విజేతలకు హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలు చూపిస్తాం’ అన్నారు

No comments:

Post a Comment