Dog

Monday, 13 June 2011

kathulu - juthulu-suthulu


ఒకప్పుడు 1960-70ల మధ్యకాలంలో జానపద కథలకు జనం పట్టాభిషేకం చేశారు. కత్తియుద్ధాలు చేసే ఓ కథానాయకుడు...ఓ అందమైన రాజకు మారి...ఒక దుష్టమాంత్రి కుడు.. ఇలా వీళ్ల ముగ్గురిచుట్టూ కథ తిరుగుతూ సం దడిచేసేది. నిర్మాతలకు, పంపిణీదా రులకు కనకవర్షం కురిపించాయి ఆ కథలు. ట్రెండ్‌ మారిపోయింది. జానపదా లనుండి జావళీలపాటలు పాడుకుంటూ సాంఘిక చిత్రాలు జనాదరణ పొందుతూ వచ్చాయి. డెబ్బయి అయిదు సంవత్సరాల తెలుగు సిని వజ్రోత్సవాలను కూడా జరిపేసుకుని తెలుగు ప్రేక్షకులు సంబ రపడి పోయారు. అయినా ఏమున్నది గర్వకా రణం...ఇప్పుడొస్తున్న సినిమాలు చూస్తే మనం ఏ యుగంలో ఉన్నామా అనిపిస్తుంది. raktha-movies

సాధారణంగా ఒక సినిమా హిట్‌ అయితే అదే కోవలోకి మరికొన్ని చిత్రాలు రావడం అవికూడా విజయం సాధించడం ఒకప్పుడి ట్రెండ్‌. కానీ ఇప్పుడు ఒక చిత్రం హిట్‌ కావడంతో మళ్లీ అదే మూలకథను తీసుకుని పాత్రలను మార్చేసి...కోట్లకు కోట్లకు భారీ సెట్టింగులేసేసి ప్రేక్షకుల నెత్తిపై రుద్దితే చూసే రోజులు పోయాయి. సగటు ప్రేక్షకుడు కూడా తాను చూసే సినిమాలో కనీసం ఓ పావువంతైనా సహజత్వానికి దగ్గరగా ఉందా లేదా అని చూస్తున్నాడు. ఇవన్నీ గ్రహించలేక భారీ నిర్మాతలు అంతకన్నా భారీగా ఏళ్లనాటి కత్తులకు సానబట్టి దేవుడి పేరున ‘రక్షకుడు’, ‘క్షేత్రపాలకుడు’ అంటూ హీరోల చుట్టూ అసహజమైన కథలను అల్లి ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్‌ చేసి ఘోరంగా దెబ్బతి నేస్తున్నారు.

అయితే వాళ్లవరకూ వాళ్లు తమ ప్రాజెక్టులను సేఫ్‌ చేసేసుకుంటున్నారు. తొలివారం రాబట్టుకున్న కలెక్షన్లతో సంబరపడిపోతున్నారు. కానీ వీటి ప్రభావం రాబోయే చిత్రాలమీద ఉంటుందనేది నగ్నసత్యం. ప్రచారం సరిగా చేసుకోలేని చిన్న నిర్మాత ఈ విధానం వలన భారీగా నష్టపోవాల్సివస్తోంది. మంచి కథలతో చిత్రాలు తీసినా చూసే ప్రేక్షకులే కరువైపో తున్నారు. ఇది అనారోగ్య కరమైన... అహేతుకరమైన వాతావరణంగా పరిణమిం చే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇలా విలువలు లేకుండా తీసుకుంటూ పోతే చివరకు విలువైన సినిమాలు తీసే నాధుడే కరువైపోతాడు.

నేటి సినిమాలకు కూడా నాటి నాటకాలకు పట్టిన దుస్థితే దాపురించనుందనే కఠోర వాస్తవాన్ని భారీ చిత్రాలు తీసి భారీగా చిత్రపరిశ్రమకు చేటు చేకూర్చే ప్రతి నిర్మాతా ఆలోచిం చుకోవాలి. ‘మగధీర’ చిత్రం ఇచ్చిన కలెక్షన్ల మత్తుమందు నిర్మాతలకు శాపంగా మారిందనే చెప్పాలి. ఆ తర్వాత హీరోచేతికి కత్తులిచ్చి ఇష్టమొచ్చిన కథలతో చెలరేగి పొమ్మని...మిగతా విషయాలు మేం చూసుకుంటామని నిర్మాత, దర్శకులు భరోసా ఇచ్చేసరికి పెద్ద హీరోలు కూడా ఆ మాట లకు ప్రభావి తమై కత్తులకు జుత్తుల్ని జోడించేస్తున్నారు. కథ కత్తిలా ఉండాలి కానీ.. హీరోలతో కత్తులు పట్టించడం వలన, జుత్తులు పెట్టించడం వలన ప్రయోజనం ఉండదని మన దర్శకులు, నిర్మాతలు ఎప్పటికి గ్రహిస్తారో ఏమో?

No comments:

Post a Comment