కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం : ప్రియమణి

ఒక నటిగా ప్రియమణి కత్తికి రెండు వైపులా పదునే. తన నటనతో జాతీయ పురస్కారాన్ని కొంగున కట్టేసుకోగలదు.. కొంగు చాటు అందాలన్ని టోకున ఆరబెట్టేసి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేయనూ గలదు. ఇప్పుడు తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించేందుకు తహతహలాడుతోంది. అతి త్వరలోనే మెగాఫోన్ పట్టుకునేందుకు తాను ఏర్పాట్లు చేసుకుంటున్నానని ప్రియమణి ప్రకటిస్తోంది. షూటింగ్‌లో యూనిట్ మెంబర్స్‌కు సూచనలిచ్చేందుకుగాను డైరెక్టర్స్ పట్టుకునే మినీమైక్‌ను మెగాఫోన్ అంటారు. మెగాఫోన్ పట్టుకోవడమంటే డైరెక్షన్ చేయడమని అర్దం. దర్శత్వం చేయాలన్నది తన కలని, ఆ కలను నెరవేర్చుకునేందుకు తాను ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నానని ప్రియమణి చెప్పుకొస్తున్నది. ఇటీవలకాలంలో హీరోయిన్లు డైరెక్షన్ చేయడమన్నది జరగడం లేదు. కాబట్టి ఆవిధంగానూ ప్రియమణి తన ప్రత్యేకతను ప్రకటించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లుంది!
No comments:
Post a Comment