Dog

Monday, 27 June 2011

Adurs the start-after bedurs


ఆరంభం అదుర్స్‌- ఆ తర్వాత బెదుర్స్‌
heroins
సాక్షాత్తూ మెగాస్టార్‌ చిరంజీవి సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసే మెగా ఛాన్స్‌ వచ్చినప్పుడు కరిష్మాకొటక అనే కన్యకామణి ఏం చేసి ఉంటుంది? ఎగిరి గంతేసి ఉంటుంది. ఇక హీరోయిన్‌గా తన కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోతుందని అర్జంట్‌గా డ్రీమ్స్‌లోకి కూడా వెళ్లిపోయే ఉంటుంది. కానీ, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కరిష్మాకొటక్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ అస్సలు పట్టించుకోలేదు. ఆ సినిమా తర్వాత ‘గ్లామర్‌’, అనే ఓ బి గ్రేడ్‌ సినిమాల్లో కరిష్మా నటించిందంటే.. దానినిబట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

‘కొమరం పులి’ చిత్రంలో పవన్‌ కళ్యాన్‌తో నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నికిషా పటేల్‌ పరిస్థితి ఇంకా ఘోరం. తెలుగులో ఇప్పటి వరకు ఆమెకు మరొక చాన్సే రాలేదు. ఇక గుణశేఖర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్ర పోషించిన ‘వరుడు’ చిత్రంలో వధువుగా నటించిన భానుశ్రీమెహ్రా కూడా ఇంక పెద్ద హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం అన్నది జరగని మాట అని కొంచెం ఆలశ్యంగా తెలుసుకుని.. ఇటీవలే ఓ చిన్న చిత్రం అంగీకరించింది.

ఇక పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన శియాగౌతమ్‌ పరిస్థితి కూడా ఓ హీరోయిన్‌గా దయనీయంగానే ఉంది. పూరి జగన్నాద్‌చే పరిచయం చేయబడిన రక్షిత, అసిన్‌, ఇలియానా, హన్సికల తరహాలో తాను కూడా ఓ వెలుగు వెలిగిపోవచ్చని శియా గౌతమ్‌ భావించే ఉంటుంది. అయితే తానొకటి తలొస్తే.. దైవమొకటి తలచినట్లుగా.. శియాగౌతమ్‌ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ‘నేనింతే’ తర్వాత శియా ఇప్పటికీ విడుదలకు నోచుకోని ‘ఫ్రూట్‌ సలాడ్‌’ అనే సినిమాలో నటించిందంటే దానినిబట్టి ఆమె పరిస్థితిని అర్దం చేసుకోచ్చు!

No comments:

Post a Comment