Dog

Friday, 24 June 2011

MUGGURU CINIMA


ముగ్గురూ ముగ్గురే !
MUGGURUడాడి.రామానాయుడు నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘ముగ్గురు’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ‘మహా మాయగాళ్లు’ అనేది ఉపశీర్షిక. వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవదీప్‌, రాహుల్‌ (హ్యాపీడేస్‌ ఫేమ్‌), ‘అష్టాచెమ్మా’ ఫేమ్‌ అవసరాల శ్రీనివాస్‌ టైటిల్‌ పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రీమాసేన్‌, సంజన, శ్రద్దాదాస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ప్రోగ్రెస్‌ గురించి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డాడి.రామానాయుడు మాట్లాడుతూ.. ‘మలేషియాలో చేసిన 20 రోజుల షెడ్యూల్‌లో 3 పాటలు సహా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం.

మా సొంత ఊరు కారంచేడులో నాలుగు రోజులపాటు షూటింగ్‌ చేసాం. ఈనెల 29 నుంచి జులై 10 వరకు విశాఖలో జరిగే షెడ్యూల్‌తో సినిమా దాదాపుగా పూర్తవుతుంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వి.ఎన్‌.ఆదిత్య, నవదీప్‌, రాహుల్‌, అవసరాల శ్రీనివాస్‌, శ్రద్దాదాస్‌ తదితరులు కూడా చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. సత్యానంద్‌-నివాస్‌ సంయుక్తంగా సంభాషణలందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, సాహిత్యం: చంద్రబోస్‌, ఛాయాగ్రహణం: జవహర్‌రెడ్డి. 

No comments:

Post a Comment