సంగీత దర్శకుడిగా నా స్థానం సుిస్థిరం
ఇళయరాజా, ఎ.ఆర్.రెహ్మాన్‌లను విపరీతంగా అభిమానించే చక్రి కెరీర్ ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు తనదైన బాణిలో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచిచూపిస్తూ..నవ్యపంథాలో ముందుకెళుతున్నారు. స్తబ్ధుగా ఉంటూనే ఎప్పుడూ అరడజను పైగా సినిమాలు చేస్తూజజ వాటి బాణీల కోసం కుస్తీపట్టే చక్రి..నేడు తన కెరీర్‌లో 10వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు....
మీ కెరీర్ ప్రారంభంలో జరుపుకున్న తొలి ‘పుట్టినరోజు’ ముచ్చట్లు గుర్తు చేసుకుంటారా?
ఇది ఎన్నో పుట్టినరోజు? ఈ సందర్భంగా మీ సందేశం.., ఆశయం?
పరిశ్రమకొచ్చాక..ఇది నా 10వ పుట్టనరోజు. ఇంతకాలం...నన్నాదరించిన దర్శకనిర్మాతలు, నటీనటులు, మిత్రులు అందరికీ..కృతజ్ఞతలు. వీరందరి ప్రోత్సాహంతోనే ఇక్కడ ముందుకెళుతున్నా. అలాగే ఇప్పటివరకూ చాలామంది హీరోలతో సినిమాలు చేశాను. బ్యాలెన్స్ ఉన్న ఇతర హీరోలందరితో సినిమాలు చేయాలనుంది. మహేష్, చరణ్, పవన్‌కళ్యా ణ్..ఇంకా చాలామంది ఉన్నారు.
‘సింహా’తో పెద్ద హిట్ సాధించారు. బాలకృష్ణతో మరో సినిమా ఉందా?
‘సింహా’ బాలయ్యతో నా తొలిసినిమా. పెద్ద విజయం సాధించడం చాలా సంతోషం. ఎప్పుడు కలిసినా..ఆ సినిమాలో అన్ని పాటలు హిట్లిచ్చానని బాలకృష్ణ నాతో అంటుంటారు. అలాగే ఆయనతో మరో సినిమా కోసం బాణీలు సిద్ధం చేస్తున్నా. తను కూడా త్వరలోనే కలిసే అవకాశముందని..ఇప్పటికే ఓ మాటేశారు!
ఇటీవల మీ కెరీర్ జోరు తగ్గినట్టనిపిస్తోంది?
‘జై బోలో తెలరగాణ’ తర్వాత సినిమాలు లేవు. ఇటీవలే ‘బబ్లూ’ రిలీజైంది. ఈ గ్యాప్‌కి కారణమేమిటంటే..సంతకం చేసిన సినిమాలు రిలీజ్‌కి రాకుండా ఆలస్యమవ్వడమే! మేకింగులో ఆలస్యం! నా తప్పు లేదు.
ప్రస్తుత ప్రాజెక్టులు?
వైవిఎస్ చౌదరి-సాయిధరమ్ తేజ (చిరంజీవి మేనల్లుడు) కాంబినేషన్‌లో ‘రేయ్’, తరుణ్, శ్రీకాంత్ హీరోలుగా ‘అనుచరుడు’, రానా హీరోగా ‘నా ఇష్టం’, నిఖిల్ హీరోగా ‘వీడు తేడా’, తరుణ్ హీరోగా ‘యుద్ధం’, జగపతిబాబు కొత్త సినిమా ..ఇవీ ప్రస్తుత సినిమాలు. అలాగే బాలీవుడ్‌లో ప్రకాశ్ ఝా ..నేతృత్వంలో ఓ సినిమాకి సంగీతం అందించనున్నా.
సామాజిక కార్యక్రమాలు?
రక్తదానం, బియ్యం పంపిణీ, పేదవిద్యార్థులను చదివించడం వంటి సామాజిక కార్యక్రమాలు ప్రతియేటా చేస్తున్నాం. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో అభిమానులతో కలిసి అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు నేడు చేస్తున్నాం. అభిమానులతో కలిసి మరిన్ని మంచి పనులు చేస్తాను.
No comments:
Post a Comment