విలువలు కోల్పోతున్న విదేశీ లొకేషన్లు
అలానే సిద్దార్థ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం నేపథ్యం అంతా విదేశీ సాంకేతికతతో తీయగా...అందులో లొకేషన్ల కోసం భారీ ఎత్తున విదేశాలలో ఖర్చుపెట్టారు. ఆ చిత్రం ఎలా ఆడిందో అందరికి తెలిసినదే. జూ.ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘శక్తి’, అల్లు అర్జున్ నటించిన అత్యంత భారీ చిత్రం ‘బద్రీనాధ్’ చిత్రాలలోని పాటలు కూడా విదేశాలలో చిత్రీకరించి ఆ చిత్రాలకు మరింత భారీతనాన్ని చేకూర్చారే తప్ప సినిమాలలో విశేషాలు ఏమీ లేకపోవడంతో రెండూ కూడా అభాసుపాలయ్యాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో హీరో రానా, ఇలియానాలు జంటగా వచ్చిన ‘నేను-నా రాక్షసి’ చిత్రం ఎక్కువగా బ్యాంకాక్‌లోనే జరగడం విశేషం. భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రాల నేపథ్యమంతా కూడా విదేశాలలోనే కావడం గమనార్హం. అయితే పూర్తిగా భారతదేశంలోనే నిర్మించి ఇక్కడ లొకేషన్లనే ఉపయోగించుకుని సక్సెస్ అయిన నిర్మాతలు కూడా లేకపోలేదు. ‘పోకిరి’, ‘అరుంధతి’, ‘మగధీర’, ‘అతడు’ లాంటి చిత్రాలు విదేశీ నేపథ్యం లేకుండానే విజయవంతం అయ్యాయి.
No comments:
Post a Comment