అనుష్కతో ఆట... పాట !

రెబల్’గా వైవిధ్యమైన లుక్‌తో మీ ముందుకొస్తున్నా. టైటిల్‌కు తగ్గట్టుగానే స్టైలిష్..మాస్ మూవీ ఇది. లారెన్స్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణలోనే కిక్ ఇస్తోంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ రెబల్‌లో ఉన్నాయి’’ అన్నారు ప్రభాస్. లారెన్స్ దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెబల్’. శ్రీ బాలాజీ సినీమీడియా పతాకంపై జె.భగవాన్, పుల్లారావు సం యుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా ప్రోగ్రెస్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘ఏకధాటిగా హైదరాబాద్, బ్యాంకాక్, వైజాగ్‌ల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. అక్టోబర్‌కి షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే హైబడ్జెట్ సినిమా ఇది. టైటిల్‌కి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇటీవల 13రోజులపాటు రామ్-లక్ష్మణ్ సారథ్యంలో భారీ పోరాటదృశ్యాలు చిత్రీకరించాం. ఈ వారంలోనే ప్రభాస్- అనుష్కలపై ఓ పాట చిత్రీకరించనున్నాం’ అన్నారు.
No comments:
Post a Comment