Dog

Saturday, 25 June 2011

Jenilia in Urimi

ఉరిమితే ఉప్పెనే !
Geneliasప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ..సంతోష్‌శివన్‌ రూపొందించిన మలయాళ చిత్రం ‘ఉరిమి’ తెలుగులోకి అనువాదమవుతోంది. ఎస్‌.వి.ఆర్‌.మీడియా పతాకంపై నిర్మాత శోభారాణి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ప్రభుదేవా, పృథ్వీరాజ్‌, జెనీలియా, విద్యాబాలన్‌, నిత్యామీనన్‌, ఆర్య, టబు తదితరులు నటించిన ఈ చిత్రానికి దీపక్‌ దేవ్‌ సంగీతం అందించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ ‘సహజత్వానికి పెద్ద పీట వేసి ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన చిత్రమిది. 15వ శతాబ్ధంలోని యధార్థ గాథలు, భారత్‌పై వాస్కోడిగామా దండయాత్ర తెరపై దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.

నాటి కథను నేటి కాలమానానికి కలుపుతూ తీసిన తీరు అమోఘం. యువరాణిగా జెనీలియా నటన సినిమాకే హైలైట్‌. ప్రభుదేవా డాన్స్‌లు.., కామెడీ సహా అమాయక యువరాణిగా నిత్యామీనన్‌ పాత్ర అలరిస్తుంది. విద్యాబాలన్‌, టబుల డ్యాన్స్‌లు మైమరిపిస్తాయి. యాక్షన్‌, సంగీతం, రీరికార్డింగ్‌ హాలీవుడ్‌ చిత్రాలను తలపిస్తాయి. పాటల చిత్రీకరణ అసామాన్యం’ అన్నారు. ఈ చిత్రానికి రచన :శంకర్‌ రామకృష్ణన్‌, సంగీతం: దీపక్‌దేవ్‌, మాటలు: శశాంక్‌ వి, డాన్స్‌: మధు సముద్ర, యాక్షన్‌: అనల్‌ అరసు, కెమెరా-దర్శకత్వం: సంతోష్‌ శివన్‌.

No comments:

Post a Comment