Dog

Monday, 27 June 2011

Kajal vs Sruthi hassan


చెల్లుకు చెల్లు!
kajal
కాకతాళీయంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఎవరూ ఊహించని ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటాయి. కాజల్‌ అగర్వాల్‌-శృతిహాసన్‌ల విషయంలో జరిగిన రెండు వేరువేరు వేరు సంఘటనలు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించే ‘ది బిజినెస్‌మ్యాన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను తీసుకుంటున్నట్లుగా తొలుత వార్తలొచ్చాయి. అయితే, అనంతర పరిణామాల్లో భాగంగా ఆ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను తీసుకుంటున్నట్లుగా ఇటీవలే ఓ అధికారిక ప్రకటన వెలువడింది.

అదేవిధంగా ‘మిరపకాయ్‌’ ఫేమ్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నటుడు గణేష్‌బాబు నిర్మిస్తున్న ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత కాజల్‌ అగర్వాల్‌ను అనుకుంటున్నారనే వార్తలొచ్చాయి. అయితే, తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ స్థానంలో శృతిహాసన్‌ను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి.. ‘ది బిజినెస్‌మ్యాన్‌’ అనే చిత్రంలో తనను హీరోయిన్‌గా తప్పించి.. ఆ చిత్రాన్ని చేజిక్కించుకున్న కాజల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకుగాను ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ను తీయించేసి ఆ అవకాశాన్ని తను తీసుకున్నట్లవ్వడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది!

No comments:

Post a Comment