Dog

Friday, 10 June 2011

AVATAR 2011

అవతార్‌ 2011 గా వస్తున్న గ్రీన్‌ లాంతర్‌
RAMEY_FRONTసూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, వండర్‌ ఉమెన్‌, ఆక్వామెన్‌ వంటి సూపర్‌ హీరోస్‌ కామిక్‌ బుక్స్‌ను అందించిన వార్నర్‌బ్రదర్స్‌కు చెందిన డిసి కామిక్స్‌ నుండి వెలువడినదే ‘గ్రీన్‌లాంతర్‌’. గత కొన్ని దశాబ్దాలుగా విశేష ఆదరణ పొందిన ఈ కామిక్‌ స్టోరీ ఆధారంగా ఇప్పుడు ‘గ్రీన్‌లాంతర్‌’ చిత్రం తెరకెక్కింది. మార్టిన్‌ కేంప్‌బెల్‌ దర్శకత్వంలో డొనాల్డ్‌ డె లైన్‌, జర్జ్‌బెర్లాంటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రయాన్‌ రెనాల్డ్స్‌, బ్లాక్‌లైవ్లీ, పీటర్‌ సర్గార్డ్‌, మార్క్‌స్ట్రాంగ్‌, ఏంజిలా బస్సెట్‌, టిమ్‌రాబిన్స్‌ ఇందులో కీలక పాత్రలను పోషించారు. ప్రముఖ పంపిణీ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ ద్వారా ఈ సినిమా జూన్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘అవతార్‌ 2011’ పేరుతో మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సంస్థ అందిస్తోంది. 114 నిమిషాల నిడివి ఉండే ఈ సూపర్‌హీరో బెస్ట్‌ ఫిల్మ్‌ను 150 మిలియన్‌ డాలర్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఇందులో హాల్‌ జోర్డాన్‌గా గయాన్‌రెనాల్డ్‌, అతని ప్రియురాలు కరోల్‌ ఫెర్రిస్‌గా బ్లాక్‌లైవ్లీ, హాల్‌ జోర్డాన్‌ మానిటర్‌గా మార్క్‌స్ట్రాంగ్‌ నటించారు. అద్భుతమైన గ్రాఫిక్‌వర్క్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాను ఉన్నత స్థాయిలో నిలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ అంతటా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ఈ నెల 17న విడుదలవుతున్న ‘అవతార్‌ 2011’ విజయంపై నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

No comments:

Post a Comment