‘పదుగురూ’ మెచ్చాలని...!

తాము తీసిన సినిమా పదుగురికీ నచ్చాలని.. పది కాలాలపాటు గుర్తిండిపోవాలని ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు కలలుగంటాడు. ముఖ్యంగా తాము తీసే సినిమాకు పేరు పెట్టే విషయంలో ఎంతో తర్జనభర్జన పడతారు. ఎవరూ పేరు పెట్టనివిధంగా తమ సినిమా రూపొందాలని కలలు కనే నిర్మాతలు.. తమ సినిమా పేరు విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా పెట్టబడిన టైటిల్స్‌లో కొన్నిటికి భలే చిత్రమైన సారూప్యత చేకూరుతుంది. ఇక్కడ ఉదహరిస్తున్న టైటిల్స్‌నే చూడండి.. ఒకటి మొదలుకుని పది వరకు గల అంకెలను సూచిస్తున్నాయి. మహేష్‌బాబు ‘ఒక్కడు’, మణిరత్న ‘ఇద్దరు’, రామానాయుడు ‘ముగ్గురు’, చంద్రసిద్దార్ద ‘(ఆ)నలుగురు’, కమల్‌హాసన్ ‘పంచ(అయిదు)తంత్ర’, ఇవివి సత్యనారాయణ ‘ఆరుగురు పతివ్రతలు’, దాసరి ‘ఏడంతస్తుల మేడ’, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ‘అష్టా(ఎనిమిది)చెమ్మా’, ఎయన్నార్ ‘నవ(తొమ్మిది)రాత్రి’, కమల్‌హాసన్ ‘దశావతారం’ చిత్రాలు ఒకటి నుంచి పది వరకు అంకెలను సూచిస్తున్నాయి.
No comments:
Post a Comment