
ఇటీవలకాలంలో పుట్టుకొస్తున్న కొన్ని పుకార్లు సంబంధీకుల గుండెల్లో దడ పుట్టిస్తూ.. ఉరుకులు పరుగులతో ఖండన ప్రకటనలు జారీ చేయిస్తున్నాయ్. అందాలభామ అనుష్కకు సంబంధించి ఇటీవల వెలువడిన ఓ పుకారు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమధ్య భూమికపై వెలువడి షికారు చేసిన ఓ పుకారు గురించి కూడా తెలిసిందే. చేస్తున్న ప్రతి వ్యాపారంలోనూ తీవ్రస్థాయిలో నష్టపోతున్న తన భర్త భరత్ ఠాకూర్‌తో భూమిక విడిపోయినట్లుగా సదరు పుకారు ప్రకటించిపారేసింది. జనం కూడా ‘నిజమే అయ్యుంటుంది’ అని అనుకునేంత సాధికారికంగా రూపొందించబడడం ఈ పుకారు ప్రత్యేకత. ఇక ‘రేయ్’ చిత్రంలో ఇలియానా ఓ ఐటం సాంగ్ చేస్తున్నదంటూ ఓ పుకారు పురుడు పోసుకోవడం..
దానిని వైవియస్ చౌదరి పురిట్లోనే తుంచేయడం కూడా తెలిసిందే. అలాగే.. ‘కందిరీగ’ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న కలర్స్ స్వాతి.. రామ్‌చరణ్‌తేజ్ తాజా చిత్రం ‘రచ్చ’లోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నదంటూ పుట్టుకొచ్చిన పుకారు రచ్చరచ్చ చేయ డం.. ఆగమేఘాలపై ఆ పుకారును స్వాతి ఖండించడం చకచకా జరిగిపోయాయి. అలాగే.. వెంకటేష్-త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం లో రిచా గంగోపాధ్యాయ రెండో హీరోయిన్‌గా నటిస్తున్నదంటూ వెలువడిన ఓ పుకారును సదరు చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ యుద్ధప్రాతిపదికపై ఖండించడం కూడా తెలిసిందే!
No comments:
Post a Comment