
వరుడు’ ఫేం భానుశ్రీ మెహ్రా, నూతన హీరో ఉదయ్‌తేజ్ జంటగా తిరుమల మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా శరవేగంగా చిత్రీకణ పూర్తిచేసుకుంటోంది. రంగా రవీందర్ ఈ చిత్రానికి దర్శకుడు. జె.కృష్ణారెడ్డి, జి.వేణుయాదవ్, కె.రాము గౌడ్ నిర్మాతలు. తాజా ప్రోగ్రెస్ వివరించేందుకు హైదరాబాద్ బాచుపల్లి జామతోటలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఉదయ్‌తేజ్, భానుశ్రీమెహ్రా, రంగా రవీందర్, సుధీర్, రబియా మెహ్రా (బానుశ్రీ మోహ్రా కజిన్), సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భానుశ్రీ మెహ్రా మాట్లాడుతూ ‘‘వరుడు’ తర్వాత హిందీలో ఓ సినిమా, తమిళ్‌లో ఓ సినిమా చేశాను.
గ్యాప్ తర్వాత ఇక్కడ మళ్లీ నటిస్తున్నా. సంతోషంగా ఉంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తొలి షెడ్యూల్ పూర్తయింది. 6 పాటలు ...బ్యాంకాక్, ఆస్ట్రేలియా, రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌లలో చిత్రీకరించనున్నాం. తదుపరి చివరి షెడ్యూల్ చేస్తాం. విజయదశమికి సినిమా విడుదలవుతుంది’ అన్నారు. హీరో ఉదయ్ తేజ్ మాట్లాడుతూ ‘లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమను, కెరీర్‌ను జయించి..జీవితంలో సక్సెస్ అవ్వడానికి హీరో ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సొచ్చిందో తెరపై చూపిస్తున్నారు. సుధీర్ విలన్’ అన్నారు.
No comments:
Post a Comment