
శ్రీ రాఘవేంద్ర ఫిలింస్ రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘వనకన్య -వండర్ వీరుడు’. ఆర్తి అగర్వాల్ వనకన్య. మెగా సుప్రీం వండర్‌వీరుడు. జాలాది శివశంకర్ చౌదరి నిర్మాత. శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పాట మినహా సినిమా పూర్తయిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నాలుగు పాటలు సహా టాకీ పూర్తయింది. సందేశం మేళవించిన యాక్షన్ చిత్రమిది. ఆర్తి, సుప్రీంల నటన సహా హాస్యం అలరిస్తుంది. మారేడ్‌పల్లి అడవులు, భీమిలి, అరకు, నాగార్జునసాగర్ ..తదితర లొకేషన్లలో చిత్రీకరించాం. చెట్లు..స్ర్తీలుగా మారడం సినిమాలో ప్రత్యేకత. జూలై తొలివారంలో ఆడియో విడుదల చేస్తాం’ అన్నారు.
No comments:
Post a Comment