Dog

Monday, 27 June 2011

ABOUT 'KERATAM'


యువ హృదయాలను తాకే ‘కెరటం’
keratamప్రభాస్‌ కజిన్‌ ..సిద్ధార్థ రాజ్‌కుమార్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కెరటం’. రాకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఐశ్వర్య కథానాయికలు. భీమినేని శ్రీనివాసరావు, కవిత కీలకపాత్రధారులు. సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ సోదరుడు గౌతమ్‌ పట్నాయక్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచ యమవుతున్నారు. ఎస్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌.వి.బాబు నిర్మిస్తున్నారు. తాజా ప్రోగ్రెస్‌ వివరిస్తూ ..హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భీమినేని శ్రీనివాసరావు, కవిత, ఎస్‌.వి.బాబు, గౌతమ్‌ పట్నాయక్‌, శిల్ప తదితరులు పాల్గొన్నారు. భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘జోష్‌-పేరుతో విడుదలై కన్నడలో 100రోజులు ఆడిన చిత్రమిది. యువతరం మెచ్చేలా ఉంటుంది.

తెలుగు, తమిళ్‌, మలయాళంలోనూ రీమేకవుతోంది. సిద్ధార్థ నటన హైలైట్‌. నేను హీరోకి తండ్రి పాత్రలో నటించాను’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘టీనేజి కుర్రాళ్ల కథాంశమిది. పరిపక్వత లేని వయసులో పిల్లల నిర్ణయాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అన్నారు. నిర్మాత ఎస్‌.వి.బాబు మాట్లాడుతూ ‘జూలై తొలివారంలో ఆడియో, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’ అన్నారు. సుమన్‌, యమున, వేణుమాధవ్‌, యతిరాజ్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానిి సంగీతం: జోష్వా శ్రీధర్‌, కెమెరా: ఎ.వెంకటేష్‌, పాటలు: రెహమాన్‌, డాన్స్‌: నిక్సన్‌, నోబుల్‌, ఇమ్రాన్‌, ఎడిటింగ్‌: సురేష్‌ ఆర్ట్స్‌.

No comments:

Post a Comment